Sai Dharam Tej | త్వరలో పెళ్లిపీటలెక్కనున్న మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌..? వధువు టాలీవుడ్‌ హీరోయినేనట..!

Sai Dharam Tej | మెగా ఫ్యామిలీ నుంచి టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు సాయిధరమ్‌ తేజ్‌. ‘పిల్ల నువ్వులేని జీవితం’ సినిమా హీరోగా నటించారు. ఆ తర్వాత అనిల్‌ రావిపుడి ‘సుప్రీం’లో నటించాడు. అయితే, ఇప్పటి వరకు మెగా హిట్‌ని అందుకోలేదు. ఆ తర్వాత యాక్సిడెంట్‌ కారణంగా చాలారోజుల పాటు సినిమాలకు దూరమయ్యాడు.

Sai Dharam Tej | త్వరలో పెళ్లిపీటలెక్కనున్న మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌..? వధువు టాలీవుడ్‌ హీరోయినేనట..!

Sai Dharam Tej | మెగా ఫ్యామిలీ నుంచి టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు సాయిధరమ్‌ తేజ్‌. ‘పిల్ల నువ్వులేని జీవితం’ సినిమా హీరోగా నటించారు. ఆ తర్వాత అనిల్‌ రావిపుడి ‘సుప్రీం’లో నటించాడు. అయితే, ఇప్పటి వరకు మెగా హిట్‌ని అందుకోలేదు. ఆ తర్వాత యాక్సిడెంట్‌ కారణంగా చాలారోజుల పాటు సినిమాలకు దూరమయ్యాడు. గతేడాది జూన్‌లో విరుపాక్ష మూవీతో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్నే అందుకున్నది. అయితే, మెగాహీరో త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగు హీరోయిన్‌నే పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్త తెగ వైరల్‌ అవుతున్నది.

ప్రస్తుతం వీరిద్దరు ప్రేమలో ఉన్నారని.. త్వరలోనే పెళ్లితో ఒక్కటి కాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది ఎంగేజ్‌మెంట్‌ చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతున్నది. అయితే, ఇందులో ఎంత వరకు నిజం ఉన్నది తెలియరాలేదు. ఇంతకు ముందు సైతం ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. అందులో ఏమాత్రం నిజం లేదని తేలిపోయింది. తాజాగా మరోసారి పెళ్లి వార్తలు వైరల్‌గా మారాయి. మెహరీన్‌ ఫిర్జాదా ఇంతకు ముదు రాజకీయ నాయకుడు భవ్య బిష్ణోయ్‌తో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నది. ఆ తర్వాత పలు కారణాలతో పెళ్లిని క్యాన్సిల్‌ చేసుకున్నది. ఇక గతంలోనూ నటి రెజీనా కసాండ్రాతోనూ సాయిధరమ్‌ తేజ్‌ ప్రేమ వ్యవహారం సాగిందని ప్రచారం జరిగింది. అయితే, ఆ తర్వాత రెజీనా తన లవ్‌ ఎఫైర్‌ గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. దాంతో ఇద్దరి బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అని తేలిపోయింది.