Samantha | వైద్యం కోసం హీరో దగ్గర పాతిక కోట్లు అప్పు .. షాకింగ్ రియాక్ష‌న్ ఇచ్చిన స‌మంత‌

Samantha | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఏ మాయ చేశావే చిత్రంతో ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన స‌మంత ఆన‌తి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఒక‌వైపు క‌థానాయిక‌గా న‌టిస్తూ మ‌రోవైపు లేడి ఓరియెంటెడ్ చిత్రాల‌లో న‌టిస్తుంది. య‌శోద చిత్రం స‌మంతకి మంచి హిట్ అందించ‌గా, శాకుంతలం చిత్రం మాత్రం తీవ్ర నిరాశ‌ప‌ర‌చింది. త్వ‌ర‌లో ఖుషీ అనే చిత్రంతో ప‌ల‌క‌రించ‌నుండ‌గా, సెప్టెంబ‌ర్ 1న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాపై […]

  • By: sn    cinema    Aug 06, 2023 7:40 AM IST
Samantha | వైద్యం కోసం హీరో దగ్గర పాతిక కోట్లు అప్పు .. షాకింగ్ రియాక్ష‌న్ ఇచ్చిన స‌మంత‌

Samantha | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఏ మాయ చేశావే చిత్రంతో ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన స‌మంత ఆన‌తి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఒక‌వైపు క‌థానాయిక‌గా న‌టిస్తూ మ‌రోవైపు లేడి ఓరియెంటెడ్ చిత్రాల‌లో న‌టిస్తుంది.

య‌శోద చిత్రం స‌మంతకి మంచి హిట్ అందించ‌గా, శాకుంతలం చిత్రం మాత్రం తీవ్ర నిరాశ‌ప‌ర‌చింది. త్వ‌ర‌లో ఖుషీ అనే చిత్రంతో ప‌ల‌క‌రించ‌నుండ‌గా, సెప్టెంబ‌ర్ 1న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాపై స‌మంత చాలా హోప్స్ పెట్టుకుంది. ఇక ఇదిలా ఉంటే సమంత గత కొన్ని నెలలుగా మయోసైటిస్ అనే కండరాల వ్యాధితో బాధపడుతున్న విష‌యం మ‌న‌కు తెలిసిందే.

ప్ర‌స్తుతం ఆరోగ్యంపై దృష్టి పెట్టిన స‌మంత సినిమాల‌కి ఏడాది పాటు బ్రేక్ ఇచ్చింది. ప్రస్తుతం బాలీలో తన ఫ్రెండ్‌తో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోన్న సమంత త్వరలో తన మయోసైటిస్ చికిత్స కోసం అమెరికా వెళ్లనున్నట్లు స‌మాచారం.

అయితే మ‌యోసైటిస్ వ్యాధి కోసం పాతిక కోట్లు ఖర్చు అవుతుంద‌ని తెలుస్తుండ‌గా, ఆ అమౌంట్ ని ఓ హీరో దగ్గర కొంత అప్పుగా తీసుకుందని ఇటీవల కొన్ని వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. గ‌త కొద్ది రోజులుగా దీనికి సంబంధించి అనేక ప్ర‌చారాలు జ‌రుగుతున్న నేప‌థ్యంలో స‌మంత త‌న సోష‌ల్ మీడియాలో ఆస‌క్తిక‌ర పోస్ట్ పెట్టింది.

నేన అప్పు చేయాల్సిన ప‌రిస్థితిలో లేను. నా హెల్త్ ని నేనే చూసుకోగలనని వెల్లడించింది సమంత. నా చికిత్స‌కి అంత ఖ‌ర్చు కూడా కాదు అంటూ తప్పుడు వార్తలను క్రియేట్‌ చేసేవారికి స్ట్రాంగ్‌ కౌంట్‌ ఇచ్చింది స‌మంత . ఈ అమ్మ‌డి పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారింది.

మ‌రోవైపు మ‌యోసైటిస్ చికిత్స కోసం ఏడాది పాటు బ్రేక్ తీసుకున్న స‌మంతకి దాదాపుగా 12 కోట్ల నష్టం వచ్చిందని తెలుస్తోంది. సమంత సినిమాల నుంచి ఏడాది పాటు లాంగ్ గ్యాప్ తీసుకుంటున్న నేప‌థ్యంలో కొత్తగా కమిట్ అయిన సినిమాల‌న్ని క్యాన్సిల్ చేసుకుంటుంది. ఈ క్ర‌మంలోనే ఆమెకి భారీ న‌ష్టం వ‌చ్చింద‌ని అంటున్నారు. ఇక స‌మంత న‌టించిన సిటాడెల్ అనే వెబ్ సిరీస్ కూడా త్వ‌ర‌లోనే రిలీజ్ కానుంది.