Sekhar Master| డ్యాన్స్ షోలో కన్నీరు పెట్టుకున్న శేఖర్ మాస్టర్.. కారణం ఏంటంటే..!
Sekhar Master| కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ బుల్లితెర ప్రేక్షకులకి చాలా కనెక్ట్ అయ్యాడు. పాపులర్ షోలలో ఆయన జడ్జిగా కనిపిస్తూ తెగ సందడి చేస్తున్నారు. అయితే పాపులర్ డ్యాన్స్ షో ‘ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2’ సక్సెస్ ఫుల్‌గా సాగుతుంది. ఈ షోకి శేఖర్ మాస్టర్, హన్సిక, గణేష్ మాస్టర్ లు జడ్జిలుగా వ్యవహరిస్తుండగా, ఇందు

Sekhar Master| కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ బుల్లితెర ప్రేక్షకులకి చాలా కనెక్ట్ అయ్యాడు. పాపులర్ షోలలో ఆయన జడ్జిగా కనిపిస్తూ తెగ సందడి చేస్తున్నారు. అయితే పాపులర్ డ్యాన్స్ షో ‘ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2’ సక్సెస్ ఫుల్‌గా సాగుతుంది. ఈ షోకి శేఖర్ మాస్టర్, హన్సిక, గణేష్ మాస్టర్ లు జడ్జిలుగా వ్యవహరిస్తుండగా, ఇందులో హైపర్ ఆది, శ్రీ సత్య టీమ్ లీడర్లుగా ఉన్నారు. ఢీ సెలబ్రిటీ స్పెషల్ 1 డ్యాన్స్ షోకి హోస్ట్ గా ఉన్న నందునే ఇక ఈ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తుండడం విశేషం. అయితే తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో హైపర్ ఆది తనదైన పంచ్‌లు వేస్తూ షోని రక్తి కట్టించే ప్రయత్నం చేశారు.
తాజాగా విడుదలైన ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2 ప్రోమోలో హైపర్ ఆది పంచ్‌లు తెగ కామెడీ పంచగా, చివరలో శేఖర్ మాస్టర్ ఎమోషనల్ అవుతూ ఫ్యాన్స్ కూడా ఎమోషన్ అయ్యేలా చేశాడు. చాలా మంది ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు తాము వచ్చిన దారిని మర్చిపోరు అని చెప్పిన శేఖర్ మాస్టర్.. ఇది కాంపిటీషన్ మధు. అతని మిస్టేక్ ఉన్నా కంటిన్యూ చేయాలి. మేము డ్యాన్సర్లం కదా.. మాకు డ్యాన్స్ తప్ప ఏమీ రాదు. డ్యాన్స్ మిస్ అయిపోతే మాస్టర్ ఎక్కడ వెళ్ళిపోతాడా? మాస్టర్ వెళ్ళిపోతే మాకెక్కడ అవకాశం పోతుందా?’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇన్ని దాటుకుంటూ వచ్చి సక్సెస్ అయితే.. ఫైనల్ టాస్క్ లో డ్యాన్సర్లు అరిస్తే ఆ ఆనందమే వేరు అని శేఖర్ మాస్టర్ చాలా ఎమోషనల్‌గా చెప్పుకొచ్చాడు.
షోలో మధు అనే కంటెస్టెంట్ అండ్ టీమ్ ఒక సాంగ్ కి డ్యాన్స్ చేస్తుండగా, మధ్యలో ఒక పొరపాటు జరిగింది. దీంతో ఆయన డ్యాన్స్ చేయడం ఆపేయడంతో శేఖర్ మాస్టర్ స్పందించాల్సి వచ్చింది. ఇక ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఫుల్ ఎపిసోడ్ జూలై 10, 11 తేదీల్లో ప్రసారం కానుంది. కాగా, ఢీ షోకి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షోకి పోటీగా ఎన్ని షోస్ వచ్చిన కూడా ఢీ షోకి ఉన్న క్రేజ్ వేరే లెవల్.