Sirish Bhardwaj| చిరంజీవి మాజీ అల్లుడు మృతి.. శ్రీరెడ్డి షాకింగ్ పోస్ట్
Sirish Bhardwaj| మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మొదట శిరీష్ భరద్వాజ్‌ను 2007లో ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అప్పుడు పెద్దలని ఎది
Sirish Bhardwaj| మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మొదట శిరీష్ భరద్వాజ్‌ను 2007లో ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అప్పుడు పెద్దలని ఎదిరించి మరీ అతనిని పెళ్లి చేసుకుంది. అంతేకాకుండా అతనితో పెళ్లి చేసుకున్న సమయంలో పవన్ కళ్యాణ్, చిరంజీవిపై సంచనల ఆరోపణలు చేసింది. అయితే కొన్నాళ్లుగా అతనితో బాగానే ఉన్నా తర్వాత వచ్చిన మనస్పర్ధల వలన 2011లో విడాకులు ఇచ్చి విడిపోయింది. అప్పటికే వీరికి ఒక కుమార్తె పుట్టింది. ఇక శిరీష్ నుంచి విడిపోయిన తర్వాత శ్రీజ ప్రముఖ వ్యాపారవేత్త కళ్యాణ్ దేవ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2016లో బెంగళూరులో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరగగా, ఆ దంపతులకి ఒక కూతురు పుట్టింది. ఆ తర్వాత వారు కూడా విడిపోయారు.

అయితే శ్రీజ మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ అనారోగ్యంతో కన్నుమూసారు. లంగ్స్ డ్యామేజ్‌తో హాస్పిటల్‌లో చేరిన ఆయన ఆరోగ్యం విషమించడంతో మరణించినట్లుగా తెలుస్తోంది.ఆయన మృతిపై శ్రీరెడ్డి కూడా ఫేస్ బుక్‌లో ఓ పోస్ట్ పెట్టింది. శిరీష్ భరద్వాజ్ (చిరంజీవి మాజీ అల్లుడు) ఇక లేరు. ఇప్పటికైనా నీకు శాంతి దొరికిందిరా శిరీష్. అందరూ నిన్ను మోసం చేశారు” అంటూ రాసుకొచ్చింది. శిరీష్ భరద్వాజ్ గుండె పోటుతో మృతి చెందినట్టుగా శిరీష్ స్నేహితులు తన సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. మరి శిరీష్ మృతిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇక ఇదిలా ఉంటే శ్రీజ, శిరీష్ హైదరాబాద్ లోని ఆర్య సమాజ్ లో పెద్దలను ఎదిరించి వివాహాం చేసుకున్నారు. 2012లో తనను వేధిస్తున్నరాంటూ శ్రీజ.. శిరీష్ భరద్వాజ్ పై కేసు పెట్టిన సంగతి తెలిసిందే కదా. ఆ తర్వాత 2014లో శ్రీజ.. శిరిష్ నుంచి విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత శిరీష్ మరో వివాహం చేసుకున్నాడు. శ్రీజ కూడా వేరే వివాహం చేసుకుంది. అప్పట్లో శ్రీజ, శిరీష్ భరద్వాజ్ ప్రేమ, పెళ్లి, విడాకులు.. చిరంజీవి నటించిన ఓ సినిమాను ఓ సూపర్ హిట్ సినిమాను గుర్తుకు తెచ్చాయని తెగ చర్చ జరిగింది. అయితే చిన్న వయస్సులో ఆయన ఇలా మృతి చెందడం వారి కుటుంబ సభ్యులని బాధిస్తుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram