Sobhita dhulipala| ఈ సారి ప్రూఫ్‌తో నాగ చైత‌న్య ప్రేమ‌లో ఉన్న‌ట్టు క‌న్‌ఫాం చేసిన శోభిత‌

Sobhita dhulipala|  అక్కినేని హీరో నాగ చైత‌న్య టాలీవుడ్ హీరోయిన్ స‌మంత‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.అయితే కొన్నాళ్ల‌పాటు సంతోషంగానే ఉన్న ఈ జంట 2017లో విడాకులు తీసుకొని పెద్ద షాక్ ఇచ్చారు. అయితే సమంతతో విడాకులు తీసుకున్న తరువాత తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల‌తో చై

  • By: sn    cinema    May 20, 2024 11:31 AM IST
Sobhita dhulipala| ఈ సారి ప్రూఫ్‌తో నాగ చైత‌న్య ప్రేమ‌లో ఉన్న‌ట్టు క‌న్‌ఫాం చేసిన శోభిత‌

Sobhita dhulipala|  అక్కినేని హీరో నాగ చైత‌న్య టాలీవుడ్ హీరోయిన్ స‌మంత‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.అయితే కొన్నాళ్ల‌పాటు సంతోషంగానే ఉన్న ఈ జంట 2017లో విడాకులు తీసుకొని పెద్ద షాక్ ఇచ్చారు. అయితే సమంతతో విడాకులు తీసుకున్న తరువాత తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల‌తో చైతూ రిలేష‌న్ షిప్ మెయింటైన్ చేస్తున్నాడ‌ని ప్ర‌చారాలు సాగాయి. ప‌లుమార్లు వీరిద్ద‌రు క‌లిసి క‌నిపించ‌డంతో ఇద్ద‌రు పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉన్నార‌నే టాక్ న‌డిచింది. ఆ మ‌ధ్య నాగ చైతన్య సమ్మర్ వెకేషన్‌కు వెళ్లిన ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ ఫొటోను శోభిత ధూళిపాళ లైక్ చేయడంతో ఈ విష‌యం టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది.

ఇక నాగ చైతన్య దిగిన లోకేష‌న్‌లోనే శోభిత కూడా ఫొటో దిగి పోస్ట్ చేసింది. దాంతో అనుమానాలు మ‌రింత బ‌ల‌ప‌డ్డాయి.ఇక ఇటీవ‌ల శోభిత త‌న సోష‌ల్ మీడియాలో ఒక పోస్ట్ చేస్తూ చై అనే వ‌ర్డ్‌తో లాజిక‌ల్ పోస్ట్ పెట్టింది. ఇది చై గురించా, లేకుంటే చాయ్ గురించా అనేది తెలియ‌క అంద‌రు ఆలోచ‌న‌లో ప‌డ్డారు. ఇక కేన్స్ ఫిలిం ఫెస్టివ‌ల్‌లో ఈ అమ్మ‌డు రెడ్ కార్పెట్‌పై సంద‌డి చేస్తూ ఆమెకి మ్యాచ్ అయ్యేలా C,H,D లెట‌ర్స్‌తో ఉన్న ఇయ‌ర్ రింగ్స్ ధ‌రించింది. ఇది చైత‌న్య పేరు వ‌చ్చేలానే ధ‌రించింద‌ని కొంద‌రు కామెంట్ చేస్తున్నారు. మ‌రి కొంద‌రు శోభిత ఇంటిపేరు డీ కాబ‌ట్టి అలాంటి ఇయ‌ర్ రింగ్స్ ధ‌రించింద‌ని చెప్పుకు వ‌స్తున్నారు. ప్ర‌స్తుతం శోభిత త‌న లుక్స్‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది.

గతంలో నాగ చైతన్య, శోభిత లండన్ వెళ్లారు. అక్కడ ఓ హోటల్‌ చెఫ్‌తో నాగ చైతన్య ఫొటో దిగ‌గా, వెన‌క శోభిత క‌నిపించింది. దీంతో వారిద్దరు కూడా డేటింగ్‌లో ఉన్నారని ప్ర‌చారం సాగింది. అయితే నాగ చైతన్య, శోభిత డేటింగ్‌లో ఉన్నారనేది ప్రస్తుతానికి రూమర్ మాత్రమే. అయితే దీనిపై స్పందించిన వీరిద్దరు తాము కేవతం స్నేహితులమే అంటూ క్లారిటీ ఇస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ ప్ర‌చారాలు మాత్రం ఆగ‌డం లేదు.