Sobhita dhulipala| పాపం శోభిత‌.. ఆ ఘ‌ట‌న‌తో ఈ భామ‌ని తెగ ట్రోల్ చేస్తున్నారుగా..!

Sobhita dhulipala| అక్కినేని మూడో త‌రం హీరో నాగ చైత‌న్య కొన్నేళ్ల క్రితం స‌మంతని ప్రేమించి పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. వారు కొన్నాళ్ల పాటు ఎంతో అన్యోన్యంగా ఉన్న ఏవో కార‌ణాల వ‌ల‌న వారిద్ద‌రు విడిపోయారు. ఇక కొన్నాళ్ల‌పాటు సింగిల్‌గా ఉన్న నాగ చైత‌న్య ఊహించని విధంగా ఆగ‌స్ట్ 8న శోభి

  • By: sn    cinema    Aug 25, 2024 8:38 PM IST
Sobhita dhulipala| పాపం శోభిత‌.. ఆ ఘ‌ట‌న‌తో ఈ భామ‌ని తెగ ట్రోల్ చేస్తున్నారుగా..!

Sobhita dhulipala| అక్కినేని మూడో త‌రం హీరో నాగ చైత‌న్య కొన్నేళ్ల క్రితం స‌మంతని ప్రేమించి పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. వారు కొన్నాళ్ల పాటు ఎంతో అన్యోన్యంగా ఉన్న ఏవో కార‌ణాల వ‌ల‌న వారిద్ద‌రు విడిపోయారు. ఇక కొన్నాళ్ల‌పాటు సింగిల్‌గా ఉన్న నాగ చైత‌న్య ఊహించని విధంగా ఆగ‌స్ట్ 8న శోభిత ధూళిపాళ్ల‌తో నిశ్చితార్థం జ‌రుపుకున్నాడు. వీరిద్దరి ఎఫైర్ రూమర్స్ గతంలో కథనాలుగా వెలువడ్డాయి. ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయినప్పటికీ నాగ చైతన్యతో ఎఫైర్ రూమర్స్ ని శోభిత ధూళిపాళ్ల కొట్టిపారేసింది. కాని స‌డెన్‌గా ఎంగేజ్‌మెంట్ జ‌రుపుకొని పెద్ద షాకే ఇచ్చారు. అనంతరం నాగార్జున ఈ విషయాన్ని ధృవీకరించారు.

ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చి నెలలో నాగ చైతన్య-శోభితల వివాహం అని ప్రచారం జరుగుతుంది. వారి వివాహం డెస్టినేష‌న్ వెడ్డింగ్‌గా జ‌ర‌గనుంద‌ని జ‌నాలు భావిస్తున్నారు. అయితే అక్కినేని ఇంటికి కొత్త కోడలు వ‌స్తుంద‌ని మురిసిపోతున్న స‌మ‌యంలో తాజాగా జ‌రిగిన సంఘ‌ట‌న శోభిత‌ని తెగ ట్రోల్ చేసేలా ఉంది. ఆమెది ఐరన్ లెగ్ అంటూ విమర్శల దాడి చేస్తున్నారు. శోభితతో నాగ చైతన్యకు నిశ్చితార్థం జరిగిన నెల రోజుల వ్యవధిలోనే అక్కినేని కుటుంబంలో అశుభం చోటు చేసుకుంది అంటున్నారు. కాగా మాదాపూర్ సమీపంలో గల తుమ్మిడికుంట చెరువు పక్కన నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ చాలా కాలం క్రితం నిర్మించారు. అది అక్రమ నిర్మాణం అంటూ హైడ్రా ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని కూల్చివేసింది.

కోర్టులో కేసు నడుస్తుండగా ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని కూల్చివేయడం అక్రమం అని నాగార్జున ఆరోపించారు. నాగార్జునకు కోర్టులో ఊరట లభించినట్లు సమాచారం. ప్రస్తుతానికి ఎన్ కన్వెన్షన్ కూల్చివేతను హైడ్రా నిలిపి వేసింది. శోభిత అక్కినేని ఫ్యామిలీలోకి అడుగుపెట్టిన వెంటనే ఈ ఘటన చోటు చేసుకోవడం చర్చకు దారి తీయ‌డంతో శోభిత అడుగుపెట్టిన వేళ విశేషం మంచిది కాద‌ని కొంద‌రు ట్రోల్ చేస్తున్నారు. అయితే మ‌రి కొంద‌రు మాత్రం వాటిని కొట్టిపారేస్తున్నారు. ఇందులో శోభిత త‌ప్పేమి లేక‌పోయిన ఆమెని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.