Sonakshi Sinha : సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని చూసి బాలీవుడ్ నేర్చుకోవాలి
సౌత్ ఇండస్ట్రీ క్రమశిక్షణను బాలీవుడ్ నేర్చుకోవాలని సోనాక్షి సిన్హా హాట్ కామెంట్స్. ‘జటాధర’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధం.
విధాత : సౌత్ ఇండస్ట్రీని చూసి బాలీవుడ్ కొన్ని విషయాలు నేర్చుకోవాలంటూ బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా షూటింగ్స్ విషయంలో దక్షిణాది సినీ పరిశ్రమ సమయపాలన పాటిస్తుందని.. బాలీవుడ్ ఈ విషయాన్ని నేర్చుకోవాలని హాట్ కామెంట్స్ చేశారు. తొమ్మిది గంటలకు షూటింగ్‌కు వస్తే సాయంత్రం ఆరు వరకు మాత్రమే ఇక్కడ చిత్రీకరణ చేస్తారు అని..ఆ తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ షూటింగ్ నిర్వహించరని సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి కితాబునిచ్చారు.. ఇది చాలా మంచి విషయం అని సోనాక్షి చెప్పుకొచ్చారు. ఇలా చేయాలంటే క్రమశిక్షణ అవసరం అని..హిందీ పరిశ్రమలో షూటింగ్ అర్ధరాత్రి వరకూ జరుగుతుంటాయని..ఈ విషయంలో బాలీవుడ్ మారాలి అని సోనాక్షి పేర్కొన్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకునే పనిగంటల విషయంలో చేసిన వ్యాఖ్యల క్రమంలో పలువురు స్టార్లు ఒక్కొక్కరు దీనిపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.
ఇకపోతే సుధీర్‌బాబు ప్రధాన పాత్రలో వెంకట్ కల్యాణ్ తెరకెక్కించిన చిత్రం ‘జటాధర’ సినిమాలో కీలక పాత్రతో సోనాక్షి సిన్హా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సందర్బంగా ఓ ఇంటర్వ్యూలో దక్షిణాది చిత్ర పరిశ్రమపై ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను గతంలో ఒక తమిళ సినిమా (లింగ) చేశానని..చాల గ్యాప్ తర్వాత ఇన్నాళ్లకు మళ్లీ ‘జటాధర’తో తెలుగు ఆడియన్స్‌ను పలకరించబోతున్నానని తెలిపారు. ప్రాంతీయ సినిమాలు చేయాలన్న ఆసక్తి నాకు ఎప్పటినుంచో ఉందని..అయితే వరుస షెడ్యూల్స్, డేట్స్ సర్దుబాటు చేయడంలో ఇబ్బందులు రావడంతో కుదర్లేదు అని చెప్పారు. తెలుగు, హిందీ భాషల్లో జటాధర నవంబర్ 7న విడుదల కానుంది. ఇందులో సోనాక్షి విలన్ పాత్రలో కనిపించనున్నారు. అనంతపద్మనాభ స్వామి ఆలయ రహస్యాల చుట్టూ నడిచే కథతో దీన్ని రూపొందించారు. తన కెరీర్‌లో ఇప్పటివరకూ ఇలాంటి పాత్ర చేయలేదని సోనాక్షి ఈ సందర్బంగా చెప్పుకొచ్చారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram