Sonia|బిగ్ బాస్ సోనియా పెళ్లి పీటలెక్కబోతుందోచ్.. పెళ్లికి ముందే మాల్దీవ్స్ ట్రిప్
Sonia|బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమంతో చాలా మంది ఫేమస్ అవుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ 8 కార్యక్రమంతో సోనియా ఫేమస్ అయింది.మొదట్లో ఈ అమ్మడిపై అందరికి పాజిటివ్ ఒపీనియన్ ఉండేది. కాని తర్వాత తర్వాత నెగెటివిటీ ఎక్కువగా ఏర్పడింది. ఆడియన్స్ పట్టు

Sonia|బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమంతో చాలా మంది ఫేమస్ అవుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ 8 కార్యక్రమంతో సోనియా ఫేమస్ అయింది.మొదట్లో ఈ అమ్మడిపై అందరికి పాజిటివ్ ఒపీనియన్ ఉండేది. కాని తర్వాత తర్వాత నెగెటివిటీ ఎక్కువగా ఏర్పడింది. ఆడియన్స్ పట్టుబట్టి మరీ సోనియాను ఎలిమినేట్ చేసేవరకూ నిద్రపోలేదు. ముఖ్యంగా సోనియా ఎలిమినేషన్‌కి నిఖిల్ ఫ్యాన్స్‌యే కారణమనే వాదన కూడా ఎక్కువగా ఉంది. పృథ్వీ, నిఖిల్‌ల ఆటని సోనియా డిస్ట్రబ్ చేస్తుందనే టాక్ కూడా ఎక్కువగా వినిపించింది. అయితే బయటకు వచ్చాక సోనియా బిగ్ బాస్‌పై కూడా కొన్ని ఆరోపణలు చేసింది.
కావాలని తనని నెగెటివ్‌గా చూపించే ప్రయత్నం చేశారని.. అందుకు తగ్గట్లే ప్రోమోలు, ఎపిసోడ్స్ కట్ చేశారంటూ సోనియా ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆ నెగెటివిటీ వల్లే తాను హౌస్ నుంచి స్వయంగా వచ్చేశానని.. ఓటింగ్ ప్రకారం కాదంటూ కూడా షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇక సోనియా రీఎంట్రీ ఇస్తుందంటూ ప్రచారాలు సాగిన అందులో నిజం అనేది లేదు. ఇక ఇదిలా ఉంటే సోనియా ఆకుల త్వరలోనే పెళ్లిపీటలెక్కనుంది. తన బాయ్ ఫ్రెండ్ యష్ వీరగోనితో కలిసి మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టేందుకు తాను సిద్ధమైంది. బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్నప్పుడే తాను త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నట్టు చెప్పింది.
సోనియా తల్లిదండ్రులు కూడా ఓ ఇంటర్వ్యూలో సోనియాకి త్వరలో పెళ్లి చేస్తామని అన్నారు. అయితే సోనియాకు కాబోయే భర్త యష్ విషయానికి వస్తే.. అతనికి స్వయంగా ఫ్లై హై అనే టూరిజం సంస్థ ఉంది. అలాగే అబ్రాడ్ కి వెళ్లే స్టూడెంట్స్ కోసం పనిచేసే కన్సల్టెన్సీ సంస్థ కూడా మెయింటైన్ చేస్తున్నారు. అయితే సోనియా నా సంస్థలో పనిచేస్తుంది. రెండు, మూడేళ్ళుగా కలిసి పనిచేస్తున్నాం. అక్కడే పరిచయం ప్రేమగా మారడంతో పెళ్లికి రెడీ అయ్యాం. బిగ్ బాస్ కి వెళ్లేముందే చేసుకోవాలని అనుకున్నాము కానీ బిగ్ బాస్ ఛాన్స్ రావడంతో వదులుకోకూడదని సోనియా వెళ్ళింది. డిసెంబర్ లో పెళ్లి చేసుకోబోతున్నాము అని తెలిపాడు. ఇక పెళ్లికి ముందే సోనియా తన భర్తతో కలిసి మాల్దీవ్స్‌కి వెళుతున్నట్టు ఇన్‌స్టా స్టోరీ ద్వారా తెలియజేసింది.