Pushpa 2 | పుష్ప 2 మూవీలో ఐటమ్ సాంగ్ చేయనున్న టాలీవుడ్ సెన్సేషన్.. ఇంతకీ ఆ యంగ్ బ్యూటీ ఎవరో తెలుసా..?
Pushpa 2 | అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ మూవీ బన్నీకి మంచి హిట్‌ని ఇచ్చింది. ప్రస్తుతం పుష్ప ద రైజ్‌కు సీక్వెల్‌గా పుష్ప ద రూల్ తెరకెక్కుతున్నది. ఈ ఏడాది డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది.

Pushpa 2 | అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ మూవీ బన్నీకి మంచి హిట్‌ని ఇచ్చింది. ప్రస్తుతం పుష్ప ద రైజ్‌కు సీక్వెల్‌గా పుష్ప ద రూల్ తెరకెక్కుతున్నది. ఈ ఏడాది డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. ఇప్పటికే సినిమా టీజర్ విడుదలవగా మంచి స్పందన వచ్చింది. ఇక ‘సూసేకి’ సాంగ్ యూట్యూబ్‌లో దూసుకుపోతున్నది. ఇదిలా ఉండగా.. పుష్ప ద రైజ్ మూవీలో ‘ఊ అంటావా మామ’ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది.
సాంగ్‌లో అల్లు అర్జున్, సమంత మెస్మరైజ్ చేశారు. విదేశాల్లోనూ పలువురు సాంగ్‌పై రీల్స్ చేయగా వైరల్ అయ్యాయి. ఎక్కడ చూసినా ఇదే సాంగ్ వినిపించేది. ఈ క్రమంలో పుష్ప 2లో ఐటమ్ సాంగ్ ఉండనున్నది తెలుస్తుంది. దాంతో ఈ సాంగ్‌పై భారీగానే అంచనాలున్నాయి. వాస్తవానికి సుకుమార్ తన ప్రతి మూవీలోనూ ఓ బ్లాక్ బస్టర్ ఐటమ్ సాంగ్‌ను ఉండేలా చూసుకుంటారు. పుష్ప 2 సాంగ్‌పై అంచనాలు మరింత పెరుగుతున్నాయి. అయితే, ఈ ఐటమ్ సాంగ్ కోసం ఎవరిని తీసుకుంటున్నారనే చర్చ సాగుతున్నది.
మొదట యానిమల్ మూవీ బ్యూటీ త్రిప్తి డిమ్రిని తీసుకుంటారని ప్రచారం జరిగింది. అలాగే, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ పేరు సైతం తెగ వైరల్ అవుతున్నది. అయితే, ఐటమ్ సాంగ్ కోసం ఏకంగా రూ.4కోట్లు అడిగినట్లుగా తెలుస్తున్నది. రెమ్యునరేషన్ ఎక్కువ కావడంతో మేకర్స్ తెలుగు బ్యూటీని ఆశ్రయించినట్లు తెలుస్తున్నది. ఆ హీరోయిన్ ఎవరో కాదు యంగ్ బ్యూటీ శ్రీలీల. మేకర్స్ శ్రీలీల పేరును ఫైనల్ చేసినట్లు సమాచారం. దీనిపై మేకర్స్ అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. ఇక త్వరలోనే షూటింగ్ పూర్తి చేసి.. ఆ తర్వాత సినిమా ప్రమోషన్స్‌కి శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తున్నది.