Sridevi| త‌న‌ని రామ్ గోపాల్ వ‌ర్మ ఘాడంగా ప్రేమిస్తున్నాడ‌ని తెలిసి శ్రీదేవి ఏం చేసిందంటే..!

Sridevi| సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఏ విష‌యంపైన అయిన కూడా కుండ‌బద్ద‌లు కొట్టిన‌ట్టు మాట్లాడ‌తాడు. సినిమాల గురించి, స‌మాజంలో జ‌రిగే ప‌లు అంశాల గురించి కూడా ఆయ‌న ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేస్తూ వార్త‌ల‌లో నిలుస్తుంటాడు. ఒకప్పుడు వ‌ర్మ తీసే సినిమాల‌కి ఎంతో రీచ్ ఉండే

  • By: sn    cinema    Jul 26, 2024 6:29 PM IST
Sridevi| త‌న‌ని రామ్ గోపాల్ వ‌ర్మ ఘాడంగా ప్రేమిస్తున్నాడ‌ని తెలిసి శ్రీదేవి ఏం చేసిందంటే..!

Sridevi| సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఏ విష‌యంపైన అయిన కూడా కుండ‌బద్ద‌లు కొట్టిన‌ట్టు మాట్లాడ‌తాడు. సినిమాల గురించి, స‌మాజంలో జ‌రిగే ప‌లు అంశాల గురించి కూడా ఆయ‌న ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేస్తూ వార్త‌ల‌లో నిలుస్తుంటాడు. ఒకప్పుడు వ‌ర్మ తీసే సినిమాల‌కి ఎంతో రీచ్ ఉండేది. కాని ఈ మ‌ధ్య అన్ని ఫ్లాపుల‌బాట ప‌డుతున్నాయి. ఈ క్ర‌మంలో రామ్ గోపాల్ వ‌ర్మ వివాదాల‌తోనే ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తున్నాడు. అప్పుడ‌ప్పుడు ఆయ‌న శ్రీదేవి ప్ర‌స్తావ‌న కూడా తీసుకొస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తూ ఉంటాడు. రామ్ గో పాల్ వర్మకు హీరోయిన్ శ్రీదేవి అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమెను ప్రేమిస్తూ.. ఆరాధిస్తూ ఉండేవారు ఆర్జీవి.

ఎన్టీఆర్, ఏఎన్నార్ లతో శ్రీదేవి సినిమాల చేసే టైమ్ లోనే శ్రీదేవిని పిచ్చి పిచ్చిగా ప్రేమించాడు వ‌ర్మ‌. ఇక ఆమెతో సినిమా చేసే అవకాశం రావ‌డంతో మ‌నోడి ఆనందం అంతా ఇంతా కాదు. క్షణ క్షణం, గొవింద గోవింద సినిమాల్లో శ్రీదేవితో క‌లిసి న‌టించిన వ‌ర్మ ఆమెని ఎంతగానో ఆరాధించాడు.అయితే ఈ విషయం అస‌లు శ్రీదేవికి తెలుసా అనేది పెద్ద డౌట్. ఒక‌వేళ తెలిస్తే ఆమె ఎలా స్పందించింది అనే విష‌యం అంద‌రిలో ఉంది. అయితే శ్రీదేవికి రామ్ గోపాల్ వర్మ డైహార్ట్ ఫ్యాన్ అని తెలుసట కాని ఆమె ఎప్పుడూ పబ్లిక్ లో ఈ విషయాలను మాట్లాడటం కాని.. వర్మ తనను ఆరాధిస్తున్న విషయాలు చెప్పుకోవడం కాని చేయలేదు.

అయితే వ‌ర్మ త‌న‌ని చాలా ప్రేమిస్తున్నాడ‌ని తెలిసిన శ్రీదేవి చాలా జాగ్ర‌త్త ప‌డింది. ఎప్పుడు కూడా శ్రీదేవి వ‌ర్మ టేకింగ్ గురించి, ద‌ర్శ‌కుడిగా ఆయ‌న ప్ర‌తిభ గురించి మాత్ర‌మే మాట్లాడేది. ప‌ర్స‌న‌ల్ విష‌యాలు ఏవి కూడా మాట్లాడేది కాదు.అందుకు కార‌ణం సినీ ప‌రిశ్ర‌మ‌లో చిన్న విష‌యానికి కూడా పెద్ద పెద్ద రూమ‌ర్స్ పుట్టిస్తుంటారు. మొద‌టి నుండి కాంట్ర‌వ‌ర్సీల‌కి దూరంగా ఉండే శ్రీదేవి ఆ తరువాత ఆర్జీవి సినిమాల్లో కూడా నటించడం మానేసిందని టాక్. అయితే వ‌ర్మ ఎప్పుడు కూడా శ్రీదేవిని ఆరాధించ‌డం మాన‌లేదు. శ్రీదేవి చ‌నిపోయిన‌ప్పుడు చాలా బాధ‌ప‌డ్డారు.