Trisha| త్రిష నా పెళ్లి చెడ‌గొట్టాలని చూసింది… స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్

Trisha| అందాల తార త్రిష గురించి ప్రత్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ అమ్మ‌డు వ‌ర్షం సినిమాతో మంచి పేరు ప్ర‌ఖ్యాతలు సంపాదించుకుంది . వర్షం సినిమా త‌ర‌వాత త్రిష రేంజ్ పెరిగింది. స్టార్ హీరోల సరసన నటించి ఆనతి కాలంలోనే నెంబర్ 1 పొజిషన్ కు చేరుకున్న ఈ భామ సీనియ‌ర్, జూనియ‌ర్ హీరో

  • By: sn    cinema    Jun 16, 2024 2:19 PM IST
Trisha| త్రిష నా పెళ్లి చెడ‌గొట్టాలని చూసింది… స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్

Trisha| అందాల తార త్రిష గురించి ప్రత్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ అమ్మ‌డు వ‌ర్షం సినిమాతో మంచి పేరు ప్ర‌ఖ్యాతలు సంపాదించుకుంది . వర్షం సినిమా త‌ర‌వాత త్రిష రేంజ్ పెరిగింది. స్టార్ హీరోల సరసన నటించి ఆనతి కాలంలోనే నెంబర్ 1 పొజిషన్ కు చేరుకున్న ఈ భామ సీనియ‌ర్, జూనియ‌ర్ హీరోలు అనే తేడా లేకుండా అంద‌రి స‌ర‌స‌న న‌టిస్తూ మంచి పేరు తెచ్చుకుంది. తెలుగులోనే కాకుండా తమిళ్ లో కూడా తన సత్తా చాటింది. సినిమాల విషయం పక్కన పెడితే. త్రిషప్రేమాయణాలు లెక్కలేనేంత మందితో నడిపిందని నెట్టింట అనేక ప్ర‌చారాలు సాగాయి. అయితే ప్రేమాయ‌ణాలు ప‌క్క‌న పెట్టిన త్రిష ఓ వ్య‌క్తితో ఎంగేజ్‌మెంట్ జ‌రుపుకుంది.

అయితే పెళ్లి చేసుకుంటుంది అనుకుంటున్న స‌మ‌యంలో పెళ్లి క్యాన్సిల్ చేసుకొని సోలోగా ఉంటుంది. అయితే త్రిష‌కి ఇండ‌స్ట్రీలో చాలా మంది స్నేహితులు ఉన్నారు. చాలా మంది ఆర్టిస్ట్‌ల‌తో క్లోజ్‌గా ఉంటుంది త్రిష‌. ఈ క్ర‌మంలో టాలీవుడ్ హీరో శ్రీరామ్‌తో కూడా మంచి ఫ్రెండ్‌షిప్‌ను మేయింటేన్ చేస్తుంటుంది. శ్రీరామ్, త్రిష కాంబినేషన్‌లో తొలిసారి ‘మనేసెళ్లమ్’ అనే సినిమా వచ్చింది. 2003లో వచ్చిన ఈ సినిమా కమర్షియల్‌గా ఫ్లాప్ అయింది. కానీ ఈ సినిమా వళ్ల వీరిద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. త్రిషతో తను అన్ని విషయాలు షేర్ చేసుకుంటునాని, అదే విధంగా తన భార్య వందనకు లవ్ ప్రపోజ్ చేసిన విషయం కూడా చెప్పాడ‌ని శ్రీరామ్ అన్నాడు. అయితే త్రిష, వందన దగ్గరకు వెళ్లి తన గురించి బ్యాడ్‌గా చెప్పిందట.

శ్రీరామ్ కు చదువులేదు, మంచోడు కాదు, ఇంగ్లీష్ రాదు… ఇలా తన గురించి ఉన్నవి లేనివి చెప్పిందట త్రిష. అయితే ఈ విషయాన్ని తాను ప్రేమించి వందన వచ్చి శ్రీరామ్ తో చెప్పడంతో షాక్ అయ్యాడట. ఇలా ఎందుకు చెప్పావంటూ త్రిషనే అడిగాడట శ్రీరామ్. దాంతో త్రిష వందన నా ఫ్రెండ్.. నీలాంటి వాడికి ఎలారా ఇచ్చేది తనను అంటు గట్టిగా నవ్విందట. అప్పుడు తనకు అర్ధం అయ్యింది… అది ప్రాంక్ అని. రీసెంట్‌గా శ్రీరామ్ ఓ ఈవెంట్‌లో త్రిష గురించి సంచలన విషయాలు బయటపెట్టాడు. ఇప్పుడు ఈ విష‌యం నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.