పవన్ కు కథ రెడీ..విజయేంద్రప్రసాద్

విధాత:విజయేంద్రప్రసాద్.. దేశంలోనే అత్యథిక పారితోషికం తీసుకుంటున్న రచయిత. ఇతడి కథలకు మంచి డిమాండ్ ఉంది. తనయుడు రాజమౌళి తీసే సినిమాలన్నింటికీ కథలు అందించడంతో పాటు ఇతర దర్శకులు, హీరోలకు కూడా కథలు అందిస్తున్నాడు విజయేంద్రప్రసాద్. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ కు కూడా ఓ కథ వినిపించాడు ఈ సీనియర్ రైటర్. విజయేంద్రప్రసాద్ చెప్పిన కథ పవన్ కల్యాణ్ కు బాగా నచ్చిందట.స్పాట్ లో ఆ కథలో నటించడానికి ఓకే చెప్పారట. అయితే ఈ కథను ఎవరు […]

పవన్ కు కథ రెడీ..విజయేంద్రప్రసాద్

విధాత:విజయేంద్రప్రసాద్.. దేశంలోనే అత్యథిక పారితోషికం తీసుకుంటున్న రచయిత. ఇతడి కథలకు మంచి డిమాండ్ ఉంది. తనయుడు రాజమౌళి తీసే సినిమాలన్నింటికీ కథలు అందించడంతో పాటు ఇతర దర్శకులు, హీరోలకు కూడా కథలు అందిస్తున్నాడు విజయేంద్రప్రసాద్. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ కు కూడా ఓ కథ వినిపించాడు ఈ సీనియర్ రైటర్.

విజయేంద్రప్రసాద్ చెప్పిన కథ పవన్ కల్యాణ్ కు బాగా నచ్చిందట.స్పాట్ లో ఆ కథలో నటించడానికి ఓకే చెప్పారట. అయితే ఈ కథను ఎవరు డైరక్ట్ చేస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్. పవన్ ఓకే అనాలే కానీ,టాలీవుడ్ లో దర్శకులంతా క్యూ కడతారు. కాబట్టి విజయేంద్రప్రసాద్ కథకు దర్శకుడ్ని వెదకడం సమస్య కానేకాదు.కాకపోతే.. ఈ కథ ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందనేది పెద్ద ప్రశ్న.ఎందుకంటే పవన్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు. చేతిలో 3 సినిమాలున్నాయి.ఇలాంటి టైమ్ లో విజయేంద్రప్రసాద్ కథకు ఎప్పుడు మోక్షం లభిస్తుందో చూడాలి.

ReadMore:కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డ..హీరో సూర్య