CP VC Sajjanar : జాగ్రత్త! నా ముఖం చూసి మోసపోవద్దు

సైబర్ నేరగాళ్లు తన ఫోటోను వాట్సాప్ డీపీగా పెట్టుకుని తెలిసినవారికి సందేశాలు పంపుతూ మోసాలకు పాల్పడుతున్నారని హైదరాబాద్ సీపీ వీ.సీ.సజ్జనార్ హెచ్చరించారు. అవి నకిలీ ఖాతాలని, వాటికి స్పందించవద్దని, వెంటనే బ్లాక్ చేసి డబ్బులు పంపవద్దని ప్రజలకు సూచించారు.

CP VC Sajjanar : జాగ్రత్త! నా ముఖం చూసి మోసపోవద్దు

విధాత, హైదరాబాద్ : వాట్సాప్ లో డీపీగా నా ఫోటోను పెట్టుకుని తెలిసిన వాళ్లకు సందేశాలు పంపిస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది అని..ఇవి నకిలీ ఖాతాలు. పూర్తిగా మోసపూరితమైనవి అని హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ వీ.సీ.సజ్జనార్ హెచ్చరించారు. ఇలాంటి సందేశాలకు స్పందించకండని.. ఆ నంబర్లను వెంటనే బ్లాక్ చేసి పోలీసులకు రిపోర్ట్ చేయండి అని సూచించారు. సైబర్ నేరగాళ్లకు మీ వ్యక్తిగత వివరాలను అసలే ఇవ్వొద్దు అని.. డబ్బులు అడిగితే పంపించొద్దు అని స్పష్టం చేశారు. సైబర్ మోసగాళ్లకు మీ జాగ్రత్తే అడ్డుకట్టనే విషయం మరచిపోవద్దు అన్నారు

నకిలీ వాట్సాప్ ఖాతాలు మీ దృష్టికి వస్తే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. అలాగే జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ http://cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండని తెలిపారు.