ఏంటి.. సుబ్బ‌రాజుకి ఇంకా పెళ్లి కాలేదా.. 46 ఏళ్లు వ‌చ్చిన పెళ్లి చేసుకోక‌పోవ‌డానికి కార‌ణం ఏంటి?

  • By: sn    cinema    Apr 06, 2024 7:40 AM IST
ఏంటి.. సుబ్బ‌రాజుకి ఇంకా పెళ్లి కాలేదా.. 46 ఏళ్లు వ‌చ్చిన పెళ్లి చేసుకోక‌పోవ‌డానికి కార‌ణం ఏంటి?

టాలీవుడ్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ సుబ్బ‌రాజు గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆయ‌న తెలుగులో వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషించి మెప్పించాడు. ఏ పాత్ర‌లో అయిన ఇట్టే ఇమిడిపోయే సుబ్బ‌రాజు బాహుబ‌లి 2 చిత్రంలో త‌న పాత్ర‌తో దేశ వ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఆయ‌న ఇప్పటి వ‌ర‌కు తెలుగు మాత్రమే కాకుండా .. తమిళ, హిందీ, మలయాళ భాషల్లో 100కు పైగా చిత్రాల్లో న‌టించి అల‌రించాడు. పాత్ర‌లో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేయ‌డం, ఆ పాత్ర‌ని ర‌క్తి క‌ట్టంచేలా చేయ‌డం సుబ్బ‌రాజు స్పెషాలిటి. అత‌ను హీరో ఫిజిక్ మెయింటైన్ చేస్తూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తూ ఉంటాడు. అయితే సుబ్బ‌రాజు ఇప్పటికీ కూడా పెళ్లి పీట‌లెక్క‌లేదు.

సుబ్బరాజు వయస్సు ప్రస్తుతం 46 సంవత్సరాలు కాగా, ఆయ‌న ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. అయితే పెళ్లి చేసుకోక‌పోవ‌డానికి కార‌ణం ఏంట‌ని అడిగితే.. అస‌లు పెళ్లి ఎందుకు చేసుకోవాలో త‌న‌కు అర్ధం కావ‌డం లేద‌ని అన్నారు. ఏదైన ప‌ని చేయ‌డానికి ప్ర‌త్యేక‌మైన కార‌ణం త‌ప్పక ఉంటుంది. కాని పెళ్లి చేసుకోక‌పోవ‌డానికి కార‌ణం ఏంటంటే నా ద‌గ్గ‌ర ఓ ఆన్స‌ర్ ఉంది. పెళ్లి అనేది మ‌నకు అనిపించిన‌ప్పుడే చేసుకోవాలి. 25,30 ఏళ్లు వచ్చాయ్ క‌దా అని పెళ్లి చేస్తుంటారు. అయితే పెళ్లి విష‌యంలో త‌ల్లిదండ్రుల ఒత్తిడిని త‌ట్టుకొని ఉండాలి. పెళ్లి అనేది మ‌న మ‌న‌స్సుకి న‌చ్చిన అమ్మాయి దొరికిన‌ప్పుడే పెళ్లి చేసుకోవాలి. మ‌నం చేసుకోబోయే అమ్మాయికి మంచి జీవితం ఇవ్వ‌గ‌ల‌ను అని న‌మ్మ‌కం ఎప్పుడు అయితే వ‌స‌తుందో అప్పుడే పెళ్లి గురించి ఆలోచించాలి.

మ్యారేజ్ చేసుకుని.. ఇది వర్కువుట్ అవ్వకపోతే ఇంకొకటి అన్నట్టు నా మెంటాలిటీ ఉండ‌దు. పెళ్లి అనేది కారు, ఇల్లు లాంటిది కాదు. టైం వ‌చ్చిన‌ప్పుడు పెళ్లి త‌ప్ప‌క చేసుకుంటాను అని చెప్పుకొచ్చారు సుబ్బ‌రాజు. ఇక సుబ్బరాజు సినిమా ఇండ‌స్ట్రీలోకి రావ‌డం వెన‌క పెద్ద క‌థే ఉంది. ఆయ‌న‌ అనుకోకుండా చిత్రసీమకు పరిచయమయ్యాడు. దర్శకుడు కృష్ణవంశీ.. ఇంట్లో ఉప‌యోగించే కంప్యూటర్‌కు ఏదో సమస్య రావడంతో.. దాన్ని క్లియర్ చేయించమని తన అసిస్టెంట్‌కు సూచించారట. ఆ కంప్యూటర్ రిపేర్ చేసేందుకు సుబ్బ‌రాజు కృష్ణ‌వంశీ ఇంటికి వెళ్ల‌గా అప్పుడు ఆ స‌మ‌యంలో సుబ్బ‌రాజుని చూసి ఫుల్ ఫిదా అయ్యాడ‌ట కృష్ణ‌వంశీ. మనోడి ఒడ్డు పొడువు చూసి ఖడ్గం మూవీలో చిన్న రోల్ ఆఫర్ చేశారు. ఆ సినిమాలో సుబ్బ‌రాజు పాత్ర‌కి మంచి పేరు రావ‌డంతో ఆ త‌ర్వాత అవ‌కాశాలు క్యూ క‌ట్టాయి.