Spirit| స్పిరిట్ లో ప్రభాస్ తండ్రిగా చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లు వెండితెరను పంచుకోబోతున్నారన్న న్యూస్ వైరల్ గా మారింది. డైరక్టర్ సందీప్ వంగా దర్శకత్వంలో వస్తున్న స్పిరిట్ సినిమాలో ప్రభాస్ తండ్రిగా ఓ బలమైన పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటించేందుకు అంగీకరించినట్లుగా ఫిల్మీ సర్కిల్ టాక్

విధాత : మెగాస్టార్ చిరంజీవి, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లు వెండితెరను పంచుకోబోతున్నారన్న న్యూస్ వైరల్ గా మారింది. డైరక్టర్ సందీప్ వంగా దర్శకత్వంలో వస్తున్న స్పిరిట్ సినిమాలో ప్రభాస్ తండ్రిగా ఓ బలమైన పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటించేందుకు అంగీకరించినట్లుగా ఫిల్మీ సర్కిల్ టాక్. ఇదే విషయాన్ని దర్శకుడు బాబీ కూడా ట్వీట్ చేశాడు. స్పిరిట్ మూవీలో ప్రభాస్, చిరంజీవితో పాటు బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ కూడా నటించబోతున్నట్లుగా వెల్లడించారు. ముగ్గురు అగ్రనటుల కాంబోలో రాబోతున్న స్పిరిట్ సినిమా వెండితెరపై ప్రత్యేకంగా ఉండబోతుందంటూ బాబీ తన పోస్టులో పేర్కొన్నాడు. ఇదే ట్వీట్ లో ప్రభాస్ ఫౌజీ సినిమా రజాకార్ల నేపథ్యంతో కూడిన భావోద్వేగ పిరియాడిక్ చిత్రంగా రాబోతుందని కూడా వెల్లడించడం విశేషం.
సందీప్‌రెడ్డి యానిమల్ సినిమాలో కూడా హీరో తండ్రి పాత్రకు చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉంది. అదే తరహాలో స్పిరిట్ మూవీలో ప్రభాస్ తండ్రి పాత్రకు కూడా ప్రధానమైందని..ఈ పాత్రకు చిరంజీవి ఓకే చెప్పడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయని..ఇదొక మల్టీస్టారర్ గా నిలిచిపోతుందని అభిమానులు భావిస్తున్నారు. స్పిరిట్ సినిమాలో త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తున్నారు.