కాంకేర్ జిల్లాలో ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోలు హతం
చత్తీస్‌గఢ్ కాంకేర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు

హైదరాబాద్, సెప్టెంబర్ 28(విధాత): చత్తీస్‌గఢ్ కాంకేర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. కాంకేర్, గరియాబంద్ జిల్లాల సరిహద్దులోని రావస్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారం అందడతో డీఆర్‌జీ బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య భీకర కాల్పులు జరిగినట్లు ఆ జిల్లా ఎస్పీ తెలిపారు. ఘటనా స్థలం వద్ద ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. మృతి చెందిన వారిలో ఓ మహిళా, ఏరియా కమిటీ సభ్యలు కూడా ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇప్పుడు జరిగిన ఎన్‌కౌంటర్‌తో కలిపి చత్తీస్‌గఢ్‌లో జరిగిన వేర్వేరు కాల్పుల్లో 252 మంది మావోలు హతమయ్యారని పేర్కొన్నారు.