Tirumala Srivari Brahmotsavam| శ్రీవారికి గరుడ వాహన సేవ..భక్తులతో కిక్కిరిసిన తిరుమల
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం మోహినీ అవతారంలో, గరుడ వాహన సేవలో శ్రీ వేంకటేశ్వరస్వామి మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.
విధాత : తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు(Tirumala Srivari Brahmotsavam) వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం మోహినీ అవతారంలో(Mohini Avataram) శ్రీ వేంకటేశ్వరస్వామి మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. పక్కనే దంతపు పల్లకిపై కృష్ణుడి రూపంలోనూ శ్రీవారు భక్తులకు అభయప్రదానం చేశారు. సాయంత్రం శ్రీనివాసుడు గరుడ వాహనంపై( Garuda Vahanam)ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు.
గరుడ వాహనసేవను తిలకించి తరించేందుకు భక్తుల భారీ సంఖ్యలో తిరుమల కొండకు చేరుకోవడంతో కొండ పరిసరాలు..తిరుమాఢ వీధులు భక్తుల రద్దీతో కిక్కిరిశాయి. శనివారం రాత్రి నుంచే భక్తులు కొండపైకి చేరుకున్నారు. గ్యాలరీల్లో ఉన్న భక్తులకు టీటీడీ సిబ్బంది పాలు, బిస్కెట్లు అందజేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram