Sai Pallavi| సాయి పల్లవిలో దేవత లక్షణాలు లేవు.. ఆమె దేవత పాత్రకు పనికి రాదు..!
Sai Pallavi| ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో అనేక క్రేజీ ప్రాజెక్ట్స్ రూపొందుతున్న విషయం తెలిసిందే. వాటిలో రామాయణం ఒకటి. 'దంగల్' ఫేమ్ దర్శకుడు నితీష్ తివారీ అత్యంత భారీ బడ్జెట్ తో, ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తోంది.

Sai Pallavi| ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో అనేక క్రేజీ ప్రాజెక్ట్స్ రూపొందుతున్న విషయం తెలిసిందే. వాటిలో రామాయణం ఒకటి. ‘దంగల్’ ఫేమ్ దర్శకుడు నితీష్ తివారీ అత్యంత భారీ బడ్జెట్ తో, ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తోంది. అయితే రీసెంట్ గా సెట్ నుండి కొన్ని పిక్స్ లీక్ కాగా, అందులో రణబీర్ కపూర్ రాముడి గెటప్‌లో, సాయి పల్లవి తల్లి సీత పాత్రలో కనిపించి అభిమానులని అలరించారు. వీరిద్దరిని అలా చూసి ఫ్యాన్స్ కూడా మురిసిపోయారు. కాని సునీల్ లాహ్రి మాత్రం అన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. రామానంద్ సాగర్ టీవీ సిరీస్ ‘రామాయణం’లో లక్ష్మణుడి పాత్రను పోషించిన సునీల్ లాహ్రి రీసెంట్‌గా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
రణ్‌బీర్ లుక్ గురించి మాట్లాడిన ఆయన.. ‘రణబీర్ లుక్ నాకు బాగా నచ్చింది. అతను తెలివైనవాడు కాబట్టి పాత్రలో ఎంతో పరిపూర్ణంగా కనిపిస్తాడని అన్నారు. అసలు యానిమల్ మూవీ చూశాక జనాలు రణ్‌బీర్‌ని రాముడిగా అంగీకరించడం కష్టంతో కూడుకున్న పని. అయితే రణబీర్ ను జనాలు ఎంతవరకు ఆదరిస్తారో తెలియదు. ఇమేజ్ లేదా బ్యాగేజీ లేని నటుడిని రాముడిగా నటింపజేస్తే సత్ఫలితం ఉంటుందని నేను భావిస్తున్నాను అని స్పష్టం చేశారు. ఇక సాయి పల్లవి గురించి మాట్లాడుతూ..’నటిగా ఆమె ఎలా చేస్తుందో నాకు తెలియదు, ఆమె చేసిన పనిని లేదా సినిమాలను ఇంత వరకు చూసింది లేదు. కానీ లుక్స్ పరంగా ఆమెలో దేవత లక్షణాలు లేవు. నా మనసులో సీత ముఖం చాలా అందంగా, ఎంతో పరిపూర్ణంగా ఉంటుంది. అవి సాయి పల్లవి ముఖంలో నాకు కనిపించడం లేదు.
రావణుడు ఆమెతో ప్రేమలో పడేంత ఆకర్షిణీయంగా నటి ఉండాలి అని సునీల్ చెప్పుకొచ్చాడు. ఈయన కామెంట్స్‌పై దారుణమైన ట్రోల్స్ వస్తున్నాయి. ఒకసారి ఆమె సినిమాలు చూసి, ఆమె నటన చూసి తర్వాత మీ అభిప్రాయాన్ని చెప్పడంటూ సూచనలు చేస్తున్నారు. ప్రస్తుతం సునీల్ చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.