Suprita| ఇటీవల సోషల్ మీడియా ద్వారా చాలా మంది తెగ ఫేమస్ అవుతున్నారు. ఈ క్రమంలోనే నటి సురేఖా వాణి కూతురు సుప్రిత కూడా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. తల్లి సినిమా ఆర్టిస్టుగా పాపులర్ అవగా.. కూతురు మాత్రం చిన్న వయసులోనే సోషల్ మీడియా ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది.ఈ అమ్మడు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపో
Suprita| ఇటీవల సోషల్ మీడియా ద్వారా చాలా మంది తెగ ఫేమస్ అవుతున్నారు. ఈ క్రమంలోనే నటి సురేఖా వాణి కూతురు సుప్రిత కూడా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. తల్లి సినిమా ఆర్టిస్టుగా పాపులర్ అవగా.. కూతురు మాత్రం చిన్న వయసులోనే సోషల్ మీడియా ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది.ఈ అమ్మడు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉండడంతో కుర్రాళ్లకు క్రష్‌గా కూడా మారింది సుప్రిత. ఆమె నెట్టింట తన తల్లితో చేసే సందడి మాములుగా లేదు. ఇక 2019లో ‘మనీ మైండెడ్ గర్ల్‌ఫ్రెండ్’ అనే షార్ట్ ఫిల్మ్‌తో నటిగా ప్రయాణం కొనసాగించిన ఈ చిన్నది ఆ తర్వాత ‘అవర్స్ వర్సెస్ అదర్స్’, ‘వెళ్లిపో’, ‘గాయత్రి పోతే పోవే’ అనే కవర్ సాంగ్‌లు చేసి ఫేమస్ అయింది.
ఇప్పుడు హీరోయిన్గా కూడా సందడి చేసేందుకు సిద్ధమైంది సుప్రిత. ఇటీవలే సుప్రిత హీరోయిన్గా నటిస్తున్న మూవీకి సంబంధించిన షూటింగ్ మొదలైంది. చిత్రంలో బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ హీరోగా నటిస్తుండటం విశేషం. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మూవీతో సుప్రితకి మంచి క్రేజ్ దక్కడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక అడపాదడపా సుప్రిత సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూ వార్తలలో నిలుస్తూ ఉంటుంది. తాజాగా ఆమె ఇండియన్ ఐడల్ విన్నర్, స్టార్ సింగర్‌పై తన క్రష్‌ని బయటపెట్టింది.తనంటే చాలా ఇష్టమని, సింగిల్ అయితే తనకు ఓకే అంటూ స్టన్నింగ్ స్టేట్మెంట్ పాస్ చేసింది.
రీతూ చౌదరి యాంకర్ గా దావత్ అనే టాక్ షో తాజా ఎపిసోడ్లో సింగర్ శ్రీరామ చంద్ర పాల్గొన్నారు. ఓ వైపు తనకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇంతలో యాంకర్ రీతూ చౌదరి.. ఆయనపై ఇద్దరు భామలు క్రష్ పెంచుకున్నట్టు తెలియజేసింది. ఎవరు అని శ్రీరామ చంద్ర అడగ్గా దానికి రీతూ కుషిత, సుప్రిత అని చెప్పింది. ఓ సారి కుషితని ఎలాంటి అబ్బాయి కావాలని అడిగితే.. శ్రీరామ చంద్ర లాంటి అబ్బాయి కావాలని చెప్పింది. దీంతో మనోడు కాస్త ఆటిట్యూడ్ చూపించినట్టుగా అర్ధమైంది. మరోవైపు శ్రీరామ చంద్ర నా క్రష్ అని సుప్రిత చెప్పిందని రీతూ పేర్కొంది. శ్రీరామ చంద్ర దావత్ షోకి వస్తున్నాడని సుప్రితతో చెబితే.. ఏ అడుగు నేను సింగిలే, ఆయన సింగిలా కాదా అని అడగమని చెప్పిందని రీతూ తెలియజేసింది. అయితే అప్పుడు శ్రీరామచంద్ర తాను సింగిలే అని, ఎవరైనా ట్రై చేసుకోవచ్చు అని చెప్పడం కొసమెరుపు.