vishwambhara first look | చిరంజీవి బర్త్‌డే రోజున విశ్వంభర ఫస్ట్‌లుక్ వచ్చేసింది

మెగాస్టార్ హీరోగా చిరంజీవి బర్త్‌డే సందర్భంగా శుక్రవారం ఆయన కథానాయకుడిగా వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర చిత్రం నుంచి ఫస్ట్‌లుక్ విడుదల చేశారు.

vishwambhara first look | చిరంజీవి బర్త్‌డే రోజున విశ్వంభర ఫస్ట్‌లుక్ వచ్చేసింది

విధాత, హైదరాబాద్ : మెగాస్టార్ హీరోగా చిరంజీవి బర్త్‌డే సందర్భంగా శుక్రవారం ఆయన కథానాయకుడిగా వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర చిత్రం నుంచి ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రంకు సంబంధించి చిరంజీవి ఫస్టలుక్‌లో ఆయన త్రిశూలం చేత పట్టుకుని పోరాటానికి సిద్ధమైనట్లుగా కన్పించారు. “చీకటి, చెడు ఈ ప్రపంచాన్ని ఆక్రమించినప్పుడు, ఒక అద్భుతమైన తార పోరాడటానికి ప్రకాశిస్తుంది” అని చిత్ర నిర్మాణ సంస్థ పేర్కొంది. త్రిషా, అషికా రంగనాథ్ హీరోయిన్‌లుగా నటిస్తున్న విశ్వంభర మూవీని సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 10న దీనిని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ‘బింబిసార’తో’ అందరి దృష్టి ఆకర్షించిన వశిష్ట ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతున్నారు. కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. చిరంజీవి కెరిర్‌లోనే 200కోట్ల భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న ఈ సోషియో ఫాంటసీ సినిమాను అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో తెరకెక్కిస్తున్నారు. వీఎఫ్‌ఎక్స్ టెక్నాలాజీని వినియోగిస్తున్నారు. సినిమా కోసం 18భారీ సెట్ల నిర్మాణం చేసి ఓ ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించి చిత్రీకరణ జరిపారు. విశ్వంభర రాక కోసం ఆసక్తికగా ఎదురుచూస్తున్న చిరంజీవి అభిమానులకు ఆయన బర్త్‌డే కానుకగా ఫస్ట్‌లుక్ విడుదల చేసి సినిమాపై మరింత ఆసక్తి పెంచారు.