Vaishnavi Chaitanya | సహజనటి జయసుధతో మెగాస్టార్ పోల్చారంటే.. విషయమున్నట్లే!

Vaishnavi Chaitanya విధాత‌: టాలీవుడ్‌లో చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ కొట్టిన సినిమా ‘బేబీ’. డైరెక్టర్ మహతి సమర్పణలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ జూలై 14న విడుదలై దాదాపు పెట్టిన పెట్టుబడికి 8 రెట్లు ఎక్కువ సొమ్మును రాబట్టింది. అంతేనా చిన్న సినిమా తీయాలంటే ఇప్పటి పెద్ద సినిమాల ధాటికి భయపడి మానుకున్న చాలామంది నిర్మాతలకు ధైర్యానిచ్చింది. అటు కలెక్షన్స్ […]

  • By: krs    latest    Aug 03, 2023 1:10 PM IST
Vaishnavi Chaitanya | సహజనటి జయసుధతో మెగాస్టార్ పోల్చారంటే.. విషయమున్నట్లే!

Vaishnavi Chaitanya

విధాత‌: టాలీవుడ్‌లో చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ కొట్టిన సినిమా ‘బేబీ’. డైరెక్టర్ మహతి సమర్పణలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ జూలై 14న విడుదలై దాదాపు పెట్టిన పెట్టుబడికి 8 రెట్లు ఎక్కువ సొమ్మును రాబట్టింది.

అంతేనా చిన్న సినిమా తీయాలంటే ఇప్పటి పెద్ద సినిమాల ధాటికి భయపడి మానుకున్న చాలామంది నిర్మాతలకు ధైర్యానిచ్చింది. అటు కలెక్షన్స్ పరంగానే కాదు అటు ప్రశంసల పరంగా కూడా ‘బేబీ’ మంచి మార్కులే కొట్టేసింది. ఆడియన్స్‌ నుంచి మంచి టాక్‌ని సొంతం చేసుకున్న ఈ సినిమాలో ప్రతి ఒక్కరి మనసును తాకే విధంగా కథ ఉండటం కూడా ఈ సినిమా సక్సెస్‌కు ఓ కారణం.

ఈ కథ ఇద్దర్ని ప్రేమించి.. ఆ ఇద్దరిని కాదని మూడో పర్సన్ ని పెళ్ళి చేసుకునే అమ్మాయి గురించి కావడంతో.. అలా మోసపోయిన జాబితాలో ఉన్నవారినే కాకుండా.. ప్రేమను గెలవలేని వారు, గెలిచినా పెద్దలను ఒప్పించి దక్కించుకోలేనివారు, ప్రేమలో చిత్తుగా ఓడిపోయి జీవితాన్ని కోల్పోయిన వారు ఇలా అందరినీ గాఢంగా తాకింది. నేషనల్ అవార్డు అందుకున్న ‘కలర్ ఫొటో’ మూవీకి కథను అందించిన సాయి రాజేష్ దర్శకత్వం కూడా సినిమాకు ఫ్లస్ అయింది.

ఈ సినిమా తమకు నచ్చిందని చాలామందే చెప్పినా.. అది మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ చెప్పడం మరీ హైప్ తెచ్చిపెట్టింది. తనకు సినిమా చాలా బాగా నచ్చిందని, ఇక హీరోయిన్ వైష్ణవి చాలా బాగా నటించిందనే ప్రశంసలు కురిపించారు మెగాస్టార్ చిరంజీవి. అయితే కథకు తను బాగా కనెక్ట్ అయ్యానని తనలానే చాలామంది కనెక్ట్ కావడం వల్లే ఈ సక్సెస్ అందుకుందనే ప్రశంసలతోపాటు కథ మొత్తంలో విలన్ పాత్ర లేకుండా నడిపించడం బావుందనే కితాబు కూడా ఇచ్చారు.

హీరోయిన్ మానసిక వ్యధే విలన్‌గా చూపించారని అది కథకు ఫ్లస్ అయిందని, ఆమె డీ గ్లామర్ రోల్ నుంచి గ్లామర్ రోల్ కు మారే విధానం చాలా బావుందన్నారు. ఇక వైష్ణవి‌ని చిరు పొగుడుతూ.. సహజనటి జయసుధతో పోల్చడంతో ఆమె ఉబ్బి తబ్బిబైంది.

నాకు మరో జయసుధని చూసినట్లు ఉందని చిరు.. పబ్లిక్ స్టేజ్ మీద వైష్ణవి గురించి చెప్పడంతో.. ఇప్పుడామె గురించి ఇండస్ట్రీలోని మేకర్స్ అంతా ఆలోచించే పనిలో పడ్డారు. తనకు చాలా మంచి భవిష్యత్ ఉందని మెగా ఆశీస్సులు అందించారు మెగాస్టార్ చిరంజీవి.