Tollywood : క్రేజీ ఆఫర్స్ తో రితికా నాయక్ జోరు!
టాలీవుడ్‌లో వరుస ఆఫర్లతో రితికా నాయక్ దూసుకెళ్తోంది. మిరాయ్, డ్యూయెట్ సహా పలు సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధం.

Tollywood | విధాత : టాలీవుడ్ తారమణుల్లో ప్రస్తుతం రితికా నాయక్ క్రేజీ హీరోయిన్ గా మారిపోతుంది. వరుస సినీ ఆఫర్లను చేజిక్కించుకుంటూ ట్రెండీ హీరోయిన్ గా అమ్మడు ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. ఢిల్లీకి చెందిన ఈ ముద్దుగుమ్మ మోడలింగ్ ద్వారా కెరీర్ ప్రారంభించింది. 2022లో విశ్వక్ సేన్ అశోక వనంలో అర్జున కళ్యాణంతో ఎంట్రీ ఇచ్చిన రితికా నాయక్..ఆ తర్వాత రవితేజ హీరోగా నటించిన ‘ఈగల్’ సినిమాలోనూ కీలక పాత్ర పోషించింది. హాయ్ నాన్న మూవీలో నాని- మృణాల్ యంగర్ డాటర్‌గా కనిపించింది. అందం అభినయం దండిగా ఉన్న ఈ ఢిల్లీ భామ రేసులో కొంత వెనుకబడినా..ఇప్పుడుక్రేజీ ఆఫర్స్ తో దూసుకపోతుంది. సోషల్ మీడియాలో తరుచు హాట్ ఫోటోలతో కవ్వించే రితికా నాయక్ పై దర్శక, నిర్మాతాల్లో ఫోకస్ పడటంతో వరుస సినిమాలతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
ప్రస్తుతం తేజా సజ్జాతో పాన్ ఇండియా మూవీగా వస్తున్న మిరాయ్ లో ..అలాగే ఆనంద్ దేవరకొండతో కలిసి డ్యూయెట్ అనే మరో సినిమాతోనూ రితికా నాయక్ తెలుగు ప్రేక్షకులను అలరించబోతుంది. ముందుగా మిరాయ్ సెప్టెంబర్ 5న విడుదల కాబోతుంది. మెగా హీరో వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ కాంబోలో రాబోతున్న కొరియన్ బ్యాక్ డ్రాప్ హారర్ కామెడీ మూవీలోనూ ఈ అమ్మడు ఛాన్స్ దక్కించుకుంది. కొత్తగా గోపీచంద్ హీరోగా ఘాజీ ఫేం సంకల్ప్ రెడ్డి క్రేజీ ప్రాజెక్టులో నూ అమ్మడు ఛాన్స్ కొట్టేసిందని టాక్ వినిపిస్తుంది.
ఇవి కూడా చదవండి..
ట్రాన్స్ ఫార్మర్ వద్ద పడిన షటిల్ కాక్..కరెంట్ షాక్ తో బాలుడు మృతి
సీఎం రేవంత్ రెడ్డిపై కేసు కొట్టేసిన హైకోర్టు