Trisha| త్రిషలో వింత కోరికలు.. ఒక్కరోజైన మగాడిలా బ్రతకాలని ఉందట..!
Trisha| చెన్నై చంద్రం త్రిష గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. చూడచక్కని అందంతో అశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్న ఈ భామ ఇప్పటికీ కుర్ర హీరోయిన్స్‌కి పోటీ ఇస్తుంది. త్రిషను చూస్తే ఎవరికైనా 41 సంవత్సరాల వయసంటే నమ్మబుద్ది కాదు. త్రిష రోజు రోజుకి తన గ్లామర్ పెంచుకుంటూ పో

Trisha| చెన్నై చంద్రం త్రిష గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. చూడచక్కని అందంతో అశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్న ఈ భామ ఇప్పటికీ కుర్ర హీరోయిన్స్‌కి పోటీ ఇస్తుంది. త్రిషను చూస్తే ఎవరికైనా 41 సంవత్సరాల వయసంటే నమ్మబుద్ది కాదు. త్రిష రోజు రోజుకి తన గ్లామర్ పెంచుకుంటూ పోతుంది. ఈ క్రమంలో అవకాశాలు కూడా ఇట్టే వస్తున్నాయి. ఇటీవల చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాలో అవకాశం దక్కించుకుంది అందాల ముద్దుగుమ్మ త్రిష. ఈ సినిమాతో త్రిషకి తెలుగులో మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అయితే తాజాగా త్రిష చేసిన కామెంట్స్ ఆమెని ట్రోలింగ్ బారిన పడేలా చేస్తుంది.
ఒక్క రోజైన సరే తాను మగాడిలా ఉండాలంటూ వ్యాఖ్యానించింది. ఆమె విచిత్రమైన కోరిక విన్న ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు.త్రిష ఏ విషయాన్ని నిర్మొహమాటంగా మాట్లాడుతుంది. ఎవరు ఏమనుకుంటారు, ఎలాంటి రియాక్షన్స్ వస్తాయనేది చూడకుండా త్రిష కామెంట్స్ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే త్రిష మగాడి శరీర రూపకల్పన, అతని మానసిక స్థితిని తెలుసుకోవాలంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ విషయాన్ని తాను ఎప్పుడూ అమ్మతో చర్చిస్తుంటానని, పదే పదే చెబుతుంటానని, కానీ అమ్మ మాత్రం నవ్వుకొని వెళ్లిపోతుందంటూ త్రిష పేర్కొంది. అయితే త్రిష చేసిన కామెంట్స్‌పై నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు.
వెళ్లి సర్జరీ చేయించుకో అని ఒక నెటిజన్ సలహా ఇచ్చాడు. మరికొందరు మాత్రం నువ్వు ఇప్పుడు ఏమీ తీసిపోవు.. మగాడిలానే ఉన్నావు అంటూ ఘాటుగా కౌంటర్లు ఇస్తున్నారు. ఇక త్రిష సినిమాల విషయానికి వస్తే నాగార్జున 100వ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది. అజిత్, మోహన్ లాల్, కమల్ హాసన్ చిత్రాల్లో త్రిష మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది. దాదాపు 17 ఏళ్ల తర్వాత చిరంజీవితో త్రిష జతకడుతున్న సంగతి తెలిసిందే. ఇక త్రిష ఇండస్ట్రీలో పలువురు నటులతో ఎఫైర్స్ నడపగా, వారితో పలు కారణాల వలన బ్రేకప్ చెప్పింది. 2015లో చెన్నై కి చెందిన వరుణ్ మణియన్ అనే బిజినెస్ మాన్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్న త్రిష కొన్ని కారణాల వలన అతనికి బ్రేకప్ చెప్పింది.