Upasana| చిరంజీవితో ఉపాస‌న ఇంత స‌ర‌దాగా ఉంటుందా… వీడియోలు చూసి మురిసిపోతున్న ఫ్యాన్స్

Upasana| స్వ‌యంకృషితో మెగాస్టార్‌గా ఎదిగి ఎంతో మంది గుండెల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు చిరంజీవి. ఆయ‌న అజాత శత్రువు. సినిమాలే త‌ప్ప ఆయ‌న‌కి బ‌య‌ట ప్రపంచం పెద్ద‌గా తెలియ‌దు. ఎక్కువ‌గా వివాదాల‌లోకి కూడా వెళ్ల‌రు. రాజ‌కీయాల‌లోకి అనుకోకుండా వెళ్లిన అక్క‌డ ఇమ‌డలేక బ‌య‌ట‌కు

  • By: sn    cinema    May 10, 2024 10:34 AM IST
Upasana| చిరంజీవితో ఉపాస‌న ఇంత స‌ర‌దాగా ఉంటుందా… వీడియోలు చూసి మురిసిపోతున్న ఫ్యాన్స్

Upasana| స్వ‌యంకృషితో మెగాస్టార్‌గా ఎదిగి ఎంతో మంది గుండెల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు చిరంజీవి. ఆయ‌న అజాత శత్రువు. సినిమాలే త‌ప్ప ఆయ‌న‌కి బ‌య‌ట ప్రపంచం పెద్ద‌గా తెలియ‌దు. ఎక్కువ‌గా వివాదాల‌లోకి కూడా వెళ్ల‌రు. రాజ‌కీయాల‌లోకి అనుకోకుండా వెళ్లిన అక్క‌డ ఇమ‌డలేక బ‌య‌ట‌కు వ‌చ్చి సినిమాలు చేసుకుంటున్నారు. అయితే చిరంజీవి గ‌త నాలుగు ద‌శాబ్దాలుగా సినీ ప‌రిశ్ర‌మ‌కి చేసిన సేవ‌ల‌కి గాను ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఆయ‌న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులు మీదుగా పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం చిరంజీవిని పద్మభూషణ్ అవార్డుతో సత్కరించగా, ఇప్పుడు ప‌ద్మ విభూష‌ణ్ అవార్డ్ ఇవ్వ‌డంతో మెగా అభిమానులు అంద‌రు చాలా సంతోషంగా ఉన్నారు.

ఇక కార్య‌క్రమానికి చిరంజీవితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన, కుటుంబ సభ్యులు హాజర‌య్యారు. అయితే అవార్డు కార్య‌క్ర‌మంలో పాల్గొనే ముందు డ్రెస్సింగ్ రూమ్‌లో చిరంజీవికి ఓ చిన్న ఫోటో షూట్‌ను నిర్వ‌హించారు. ఆ సమ‌యంలో ఉపాస‌న చిరుతో చాలా స‌రదాగా మాట్లాడుతూ చిన్న‌పాటి ఇంట‌ర్వ్యూ కూడా చేసింది. అందుకు సంబంధించిన వీడియోల‌ని త‌న ఇన్‌స్టా స్టోరీల‌లో పోస్ట్ చేసింది. అవి ఇప్పుడు నెట్టింట ర‌చ్చ చేస్తున్నాయి. ఓ వీడియోలో ఉపాస‌న చిరంజీవిని.. క్లీంకార‌, నాలో ఉన్న కామ‌న్ పాయింట్ ఏంటి మామ‌య్య అని అడ‌గ‌గా, దానికి చిరంజీవి తాను నీకు ప్ర‌తిరూపం అని చెప్పారు. అప్పుడు ఉపాస‌న కాదు మామ‌య్య‌.. మా ఇద్ద‌రిలో ఉన్న కామ‌న్ పాయింట్ ఏమిటంటే.. మా ఇద్ద‌రి తాత‌య్య‌లు ప‌ద్మ విభూష‌ణ్ గ్ర‌హీత‌లు అంటూ చెప్పుకొచ్చింది. ఉపాస‌న తాత‌య్య ప్ర‌తాప్ చంద్రారెడ్డి 2010లో ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం అందుకున్నారు.

ఇక ఉపాస‌న షేర్ చేసిన మ‌రో వీడియోలో మామ‌య్య గారండి ఈ రోజు మీ ఫీలింగ్ ఏంట‌ని చిరుని అడ‌గ‌గా, మంచి కోడ‌లు నాకు క్లీంకార‌ని మ‌నువ‌రాలిగా ఇచ్చిన త‌రువాత అదే నాకు బిగ్గెస్ట్ అవార్డ్ అంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు. ఇక రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లోకి వెళ్లే ముందు, అక్క‌డ చిరంజీవి అవార్డ్ అందుకునే వీడియో, ప‌ద్మ విభూష‌ణ్ అవార్డ్‌తో రామ్ చ‌ర‌ణ్‌, చిరంజీవి ఉన్న ఫొటోల‌ని కూడా త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. అవి వైర‌ల్‌గా మారాయి.