Constable kanakam | థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ ‘కానిస్టేబుల్‌ కనకం’

వర్ష బొల్లమ్మ నటించిన ‘కానిస్టేబుల్ కనకం’ ట్రైలర్ విడుదల! ఆగస్టు 14న ఈటీవీ విన్‌ లో స్ట్రీమింగ్ కానున్న సస్పెన్స్ థ్రిల్లర్.

Constable kanakam | థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ ‘కానిస్టేబుల్‌ కనకం’

Constable kanakam | విధాత : తెలుగు ఓటీటీ ఈటీవీ విన్(ETVWin) వరుస సినిమాలు, వెబ్ సిరీస్ ల పరంపరలో వస్తున్న మరో యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘కానిస్టేబుల్‌ కనకం’(Constable kanakam) వెబ్ సిరీస్ ట్రైలర్ ను శుక్రవారం విడుదల చేశారు. వర్ష బొల్లమ్మ(Varsha Bollamma) ప్రధాన పాత్రలో నటిస్తున్న వెబ్‌ సిరీస్‌ ‘కానిస్టేబుల్‌ కనకం’ ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) చేతుల మీదుగా విడుదల చేసి ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచారు. 1998లో ఓ మారుమూల గ్రామంలో జరిగే క్రైమ్ ఆధారంగా ఈ సిరీస్ రూపొందించారు. రేపల్లె అనే పల్లెటూరులో వరుసగా అమ్మాయిలు మిస్ అవుతుంటారు. దీనిపై పోలీస్ విచారణ సాగుతుంది. ట్రైలర్ లో కథాంశాలను..పాత్రలను పరిచయం చేశారు. రేపల్లే గ్రామానికి ఉత్తరాన దట్టమైన చెట్లతో అడవి గుట్ట ఉంది..అడవి గుట్టలో క్రూరమైన మృగాలున్నాయి…ఇన్ని మృగాలున్న చోటుకి ఓ జింక వచ్చింది అనే డైలాగ్‌తో వర్ష బొల్లమ్మ ఎంట్రీ ఇచ్చారు.

ఆ స్టేషన్‌కు వచ్చిన కొత్త కానిస్టేబుల్ పాత్రలో వర్షకు ఎదురైన పరిణామాలను టచ్ చేస్తూ…ఎన్ని చేసినా ఆ జింక కొంచెం కూడా బెదరలేదు. ఎందుకంటే అది జింక కాదు…’ అంటూ పవర్ ఫుల్ కానిస్టేబుల్ రోల్ లో ఆమె పాత్రను హైలెట్ చేశారు. తదుపరి సన్నివేశాల్లో ప్రేక్షకులను ఏం జరుగుతుందన్న ప్రశ్నలను రగిలిస్తూ వెబ్ కంటెంట్ కు కావాల్సిన స్క్రీన్ ప్లే తో ఆధ్యతం సస్పెన్స్ థ్రిల్లర్ గా సాగింది. ప్రశాంత్‌ కుమార్‌ దర్శకత్వంలో ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్‌ ఆగస్టు 14వ తేదీ నుంచి ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. అమ్మాయిల మిస్సింగ్ వెనక మిస్టరీ ఏంటి? కానిస్టేబుల్ కనకం ఈ కేసును ఎలా చేధించింది…ఈ దర్యాప్తులో ఆమెకు ఎదురైన పరిణామాలేంటి? అనే కథతో వెబ్ సిరీస్ ఆసక్తికరంగా తీర్చిదిద్దారు.

Read more- Himayat sagar | హిమాయ‌త్ సాగ‌ర్‌కు భారీ వ‌ర‌ద‌.. ఒక గేటు ఎత్తివేత‌

US India Tarrif | అమెరికా సుంకాలపై ధీటుగా భారత్ కౌంటర్