Himayat sagar | హిమాయ‌త్ సాగ‌ర్‌కు భారీ వ‌ర‌ద‌.. ఒక గేటు ఎత్తివేత‌

Himayat sagar | హైద‌రాబాద్ న‌గ‌ర శివార్ల‌లో ఉన్న హిమాయ‌త్ సాగ‌ర్‌( Himayat sagar )కు భారీగా వ‌ర‌ద పోటెత్తింది. గురువారం రాత్రి కురిసిన భారీ వ‌ర్షానికి సాగ‌ర్‌కు మ‌రింత వ‌ర‌ద పోటెత్త‌డంతో.. వాట‌ర్ బోర్డు అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు.

Himayat sagar | హిమాయ‌త్ సాగ‌ర్‌కు భారీ వ‌ర‌ద‌.. ఒక గేటు ఎత్తివేత‌

Himayat sagar | హైద‌రాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌ర శివార్ల‌లో ఉన్న హిమాయ‌త్ సాగ‌ర్‌( Himayat sagar )కు భారీగా వ‌ర‌ద పోటెత్తింది. గురువారం రాత్రి కురిసిన భారీ వ‌ర్షానికి సాగ‌ర్‌కు మ‌రింత వ‌ర‌ద పోటెత్త‌డంతో.. వాట‌ర్ బోర్డు అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. రాత్రి 10 గంట‌ల స‌మ‌యంలో హిమాయ‌త్ సాగ‌ర్ రిజ‌ర్వాయ‌ర్ వ‌ద్ద‌కు చేరుకుని ఒక గేటును ఎత్తేశారు. మొత్తం 17 గేట్లు ఉండ‌గా, ఒక గేటును ఎత్తేసిన‌ట్లు అధికారులు తెలిపారు.

ప్ర‌స్తుతం సాగ‌ర్ నుంచి 339 క్యూసెక్కుల నీటిని మూసీ న‌దిలోకి విడుద‌ల చేశారు. దీంతో మూసీ ఉధృతంగా ప్ర‌వ‌హిస్తుంది. మూసీ న‌ది ప‌రివాహ‌క ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను అధికారులు, పోలీసులు అప్ర‌మ‌త్తం చేశారు. సాగ‌ర్‌కు ఇన్‌ఫ్లో 1000 క్యూసెక్కులుగా ఉంది.

హిమాయ‌త్ సాగ‌ర్( Himayat Sagar ) పూర్తి నీటిమ‌ట్టం 1,763.50 అడుగులు కాగా, ప్ర‌స్తుత నీటిమ‌ట్టం 1,762.70 అడుగులుగా ఉంది. రిజ‌ర్వాయ‌ర్ సామ‌ర్థ్యం 2.970 టీఎంసీలు కాగా, ప్ర‌స్తుతం 2.734 టీఎంసీలుగా ఉంది.

ఇక హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో క‌లెక్ట‌రేట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. లోత‌ట్టు ప్రాంతాల్లోకి వ‌ర‌ద నీరు చేరినా, విద్యుత్ స‌మ‌స్య‌లు త‌లెత్తినా, ట్రాఫిక్ సంబంధిత స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం 040-23202813 లేదా 7416687878 నంబ‌ర్ల‌కు కాల్ చేయొచ్చ‌ని అధికారులు పేర్కొన్నారు.