US India Tarrif | అమెరికా సుంకాలపై ధీటుగా భారత్ కౌంటర్
భారీ సుంకాలపై అమెరికాకు భారత్ కౌంటర్! బోయింగ్ P-8I జెట్ ఒప్పందం నిలిపివేతతో వాణిజ్య యుద్ధానికి భారత్ సంకేతం.

US India Tarrif | న్యూఢిల్లీ : భారత్ పై 50శాతం సుంకాలను విధించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిర్ణయానికి ధీటుగా భారత ప్రభుత్వం కూడా స్పందిస్తుంది. అమెరికా నుంచి 3.6బిలియన్ డాలర్ల విలువైన బోయింగ్ పీ81 జెట్ ల కొనుగోలు డీల్ ను భారత్ నిలిపివేసింది. 2021లో 2.41బిలియన్ డాలర్లతో ఆమెరికా నుంచి 6 పీ 81జట్ ల కొనుగొలుకు ఒప్పందం చేసుకుంది. అయితే ఈ జెట్ ల తయారీకి ముడి సరుకులు భారత్ నుంచి ఎగుమతి అవుతుండటంతో ట్రంప్ పెంచిన సుంకాలతో వాటి ధర 50శాతం పెరిగింది. ఈ నేపథ్యంలో 3.6 బిలియన్ డాలర్ల ఈ డీల్ సస్పెండ్ చేస్తూ అమెరికా టారిఫ్ కు కౌంటర్ గా భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి చమురు కొంటుందన్న కారణంతో భారత్‌పై 50శాతం సుంకాలను విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల వివాదం నేపథ్యంలో భారత్ తో ఎలాంటి వాణిజ్య చర్చలు ఉండవని స్పష్టం చేశారు. అంతటితో ఆగకుండా మరో అడుగు ముందుకేసి తదుపరి మరిన్ని ఆంక్షలను చూస్తారంటూ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అమెరికా సుంకాల పెంపుపై చర్చించేందుకు నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ జరుగనుంది. ఇప్పటికే మోదీ అమెరికా సుంకాల పెంపుపై స్పందిస్తూ దేశంలోని రైతులు, మత్స్యకారులు, పాల ఉత్పత్తుల రంగంలోని వారి ప్రయోజనాలే తమకు ముఖ్యమని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. అవసరమైతే వారిని కాపాడటం కోసం ఎంత మూల్యమైనా తాను సొంతంగా భరించడానికీ సిద్ధమని వెల్లడించారు.
మరోవైపు అమెరికా సుంకాల పెంపుపై అప్రమత్తమైన వాల్‌మార్ట్, అమెజాన్, టార్గెట్, గ్యాప్ తదితర కంపెనీలు భారత్ నుంచి స్టాక్ పంపించొద్దని టోకు వర్తకులకు లేఖలు, మెయిల్స్ పంపడం ఆసక్తికరగా మారింది. ప్రస్తుతానికి భారత్ నుంచి స్టాక్ దిగుమతులను నిలిపివేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటు దేశీయ మార్కెట్లపై సుంకాల పెంపు ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. అటు అంతర్జాతీయ పరిణామాలూ సూచీల సెంటిమెంట్‌ను దెబ్బతీస్తుండగా..స్టాక్ మార్కెట్లు నష్టాలలో సాగుతున్నాయి.
ఒక్కటిగా ట్రంప్ బాధిత దేశాలు
భారత్ పై అమెరికా ప్రతికార సుంకాల విధింపు నేపథ్యంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రష్యా అధ్యక్షుడు పుతిన్ తో భేటీ అయ్యారు. రెందు దేశాల మధ్య ద్వైపాక్షిక భద్రతపైన, అమెరికా సుంకాల వడ్డింపులపైన వారు చర్చించారు. ఈ ఏడాది చివరిలో పుతిన్ భారత్ పర్యటనకు రాబోతున్నారు. మరోవైపు ఇటీవల భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ చైనాలో పర్యటించి అధ్యక్షుడు జిన్ పింగ్ తో భేటీ కావడం ద్వారా అమెరికా నిర్ణయాలకు వ్యతిరేకంగా చైనా, భారత్, రష్యాలు ఒక్కటవుతున్నాయన్న సంకేతాలకు ఊతమిచ్చారు. అటు భారత్ మాదిరిగానే అమెరికా ప్రతికార సుంకాల సమస్య ఎదుర్కొంటున్న బ్రెజిల్ దేశం అధ్యక్షుడు లుయిజ్ ఇనాసియో లులా డసిల్వా గురువారం భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్‌లో చర్చించడం ఆసక్తికరంగా మారింది.
Read more- AP ACB Record Trap| ఏపీలో ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం..రికార్డ్ ట్రాప్
ChatGPT | తల్లిదండ్రులూ! జాగ్రత్త… టీనేజర్లకు అత్యంత ప్రమాదకర సలహాలిస్తున్న చాట్జీపీటి