Venu| నానితో వేణు సినిమా ఆగిపోయిందా.. కారణం ఏంటంటే…!
Venu| జబర్ధస్త్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వేణు ఆ తర్వాత బలగం సినిమాతో దర్శకుడిగా మారిన విషయం తెలిసిందే.తక్కువ బడ్జెట్‌తో ఈ మూవీ రూపొందగా, ఇది తెలుగు రాష్ట్ర ప్రజలందరిని ఎంతగానో ఆకట్టుకుంది.ఇక ఈ సినిమాకి భారీగా లాభాల పంట కూడా వచ్చింది. అనేక అవార్డులు ఈ మూ

Venu| జబర్ధస్త్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వేణు ఆ తర్వాత బలగం సినిమాతో దర్శకుడిగా మారిన విషయం తెలిసిందే.తక్కువ బడ్జెట్‌తో ఈ మూవీ రూపొందగా, ఇది తెలుగు రాష్ట్ర ప్రజలందరిని ఎంతగానో ఆకట్టుకుంది.ఇక ఈ సినిమాకి భారీగా లాభాల పంట కూడా వచ్చింది. అనేక అవార్డులు ఈ మూవీని పలకరించాయి. అయితే తొలి సినిమాతోనే వేణు ఇలాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో నాని తనకి బంపర్ ఆఫర్ ఇచ్చాడు.వేణు- నాని కాంబోలో సినిమా రూపొందనుందని కొన్నాళ్లుగా నెట్టింట వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఆగిపోయినట్టు టాక్ నడుస్తుంది.
నేచురల్ స్టార్ నాని మిగతా హీరోల కన్నా కూడా భిన్నంగా ఆలోచిస్తారు.ఆయన చిత్రాలకి ప్రత్యేకత ఉంటుంది. ప్రస్తుతం నాని సరిపోదా శనివారం అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీ పాన్ ఇండియా చిత్రంగా డివివి దానయ్య నిర్మాణంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే ఇక ఈ సినిమా తర్వాత నాని.. వేణు దర్శకత్వంలో మూవీ చేయనున్నారనే టాక్ నడిచింది. బలగం వేణు.. నాని కోసం కథ కూడా సిద్ధం చేశారు. ఎల్లమ్మ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్టు టాక్ నడిచింది. ఫైనల్ కాల్ తీసుకోవడం, షూటింగ్ కి వెళ్లడం మాత్రమే ఆలస్యం అంటూ నెట్టింట పలు వార్తలు చక్కర్లు కొట్టాయి. కాని తాజాగా సిని ఇండస్ట్రీలో ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఆసక్తికర వార్త ఒకటి హల్ చల్ చేస్తుంది.
బలగం వేణు దర్శకత్వంలోని నాని చిత్రం ఆగిపోయింది అంటూ వార్తలు వస్తున్నాయి. వేణు ఇటీవల ఫైనల్ నేరేషన్ ఇవ్వగా నాని ఇంప్రెస్ కాలేదని దీనితో ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని అంటున్నారు. అదేకాక నాని తన చిత్రాలకు భారీ బడ్జెట్ ఆశించడమే కాకుండా నిర్మాతలకు చుక్కలు చూపించే రెమ్యునరేషన్ అడిగినట్టు టాక్. నాని ఏకంగా 30 కోట్లు డిమాండ్ చేసినట్టు వార్తలు వినిపించాయి. బడ్జెట్ రెమ్యునరేషన్ సమస్యల వలన దాదాపు రెండు మూడు చిత్రాలు ఆగినట్టు సమాచారం. వేణు తెలంగాణ బ్యాక్ డ్రాప్ లోనే ఈ కథని కూడా సిద్ధం చేసుకున్నాడు. మరి ఈ కథతో నాని హీరోగానే సినిమా చేస్తాడా లేకుంటే మరో హీరోతో చేస్తాడా అన్నది చూడాలి.