Vettaiyan|ఓటీటీ రిలీజ్‌కి ముందే రజనీకాంత్ ఫుల్ మూవీ ఆన్‌లైన్‌లో లీక్..షాక్‌లో యూనిట్
Vettaiyan|సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రాలకి ప్రేక్షకులలో ఎంత ఆసక్తి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికీ రజనీకాంత్ వైవిధ్యమైన సినిమాలు చేస్తున్న నేపథ్యంలో ఆయన సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపుతూ ఉంటారు. రజనీకాంత్ రీసెంట్‌గా నటించిన చిత్రం వేట్టయన్. జై భీమ్ సిని

Vettaiyan|సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రాలకి ప్రేక్షకులలో ఎంత ఆసక్తి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికీ రజనీకాంత్(Rajinikanth) వైవిధ్యమైన సినిమాలు చేస్తున్న నేపథ్యంలో ఆయన సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపుతూ ఉంటారు. రజనీకాంత్ రీసెంట్‌గా నటించిన చిత్రం వేట్టయన్. జై భీమ్ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న టీజే జ్ఞానవేల్ ఈ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కించగా, ఈ మూవీ దసరా విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. తమిళ్ తో పాటు తెలుగులోనూ భారీ వసూళ్లు దక్కించుకుంది. ఇక ఓటీటీ(OTT)లో ఈ సినిమాని రిలీజ్ చేద్దాం అనుకుంటున్న సమయంలో పెద్ద షాకే తగిలింది.
రజనీకాంత్ వేట్టయన్(Vettaiyan) మూవీ ఆన్‌లైన్‌లో లీకైంది. యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ హెచ్‌డీ ప్రింట్స్ పలు పైరసీ సైట్స్‌లో దర్శనమివ్వడం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. సినిమా థియేటర్లలో నడుస్తుండగానే ఈ మూవీ ఆన్‌లైన్‌లో లీక్ కావడం ఎలా జరిగిందంటూ చర్చ నడుస్తుంది. అయితే ఇలా జరగడానికి ప్రధాన కారణం ఓవర్‌సీస్ ఓటీటీ కారణమని అంటున్నారు. ఓవర్‌సీస్‌లో శుక్రవారం ఏంథుసన్ ఓటీటీలో వేట్టయన్ మూవీ రిలీజైంది. ఓవర్‌సీస్ ఓటీటీ ప్రింట్‌ను పైరసీ చేసినట్లు సమాచారం. ఇండియాలో మాత్రం నవంబర్ ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్‌లో ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేయాలని భావించగా ఇప్పుడు వారికి పెద్ద షాక్ తగిలింది అని చెప్పాలలి.
వేట్టయన్ మూవీ అక్టోబర్ 10న థియేటర్లలో రిలీజ్ కాగా, టాక్‌తో సంబంధం లేకుండా థియేటర్లలో భారీగా వసూళ్లను రాబడుతోంది. ఇప్పటికీ తమిళ, తెలుగు వెర్షన్ థియేటర్లలో ఆడుతోంది. అయినా పదిహేను రోజుల్లోనే ఓవర్‌సీస్‌లో ఈ మూవీని ఓటీటీ(OTT)లో రిలీజ్ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతోన్నాయి. ఇక ఈ సినిమాలో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా రజనీకాంత్ కనిపించాడు. అమితాబ్‌బచ్చన్‌తో పాటు ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి కీలక పాత్రలు పోషించారు. రితికా సింగ్, మంజు వారియర్ హీరోయిన్లుగా కనిపించారు. వేట్టయన్ మూవీ పదిహేను రోజుల్లో ఇండియావైడ్‌గా 250 కోట్ల గ్రాస్‌ను…140 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటికీ ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకోలేదని సమాచారం.