Soothravakyam OTT: ఓటీటీలో.. ‘సూత్రవాక్యం’ అరుదైన రికార్డు

రెండు నెల‌ల క్రితం థియేట‌ర్ల‌కు వ‌చ్చి మంచి విజ‌యం సాధించిన మలయాళ థ్రిల్ల‌ర్ చిత్రం ‘సూత్రవాక్యం’ చిత్రం ప్రస్తుతం ఓటీటీలో దుమ్మురేపుతోంది. అంత‌కు ముందే వేరే ఓటీటీల‌లోకి వ‌చ్చిన ఈ చిత్రం రెండు రోజుల క్రితం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్కు రావ‌డంతో ఇక్క‌డా ప్రేక్షకుల నుంచి విశేష‌యైన ఆదరణ ద‌క్కుతోంది

Soothravakyam OTT: ఓటీటీలో.. ‘సూత్రవాక్యం’ అరుదైన రికార్డు

విధాత: రెండు నెల‌ల క్రితం థియేట‌ర్ల‌కు వ‌చ్చి మంచి విజ‌యం సాధించిన మలయాళ థ్రిల్ల‌ర్ చిత్రం ‘సూత్రవాక్యం’ చిత్రం ప్రస్తుతం ఓటీటీలో దుమ్మురేపుతోంది. అంత‌కు ముందే వేరే ఓటీటీల‌లోకి వ‌చ్చిన ఈ చిత్రం రెండు రోజుల క్రితం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్కు రావ‌డంతో ఇక్క‌డా ప్రేక్షకుల నుంచి విశేష‌యైన ఆదరణ ద‌క్కుతోంది. తాజాగా ఈ సినిమా 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలు దాటి అరుదైన రికార్డును సాధించినట్లు చిత్ర బృందం ప్రకటించింది.

కథ విష‌యానికి వ‌స్తే.. మధ్యలో క్రిస్టో జేవియర్ అనే పోలీస్ ఆఫీసర్ (సీఐ) ఉంటాడు. అతను తన డ్యూటీతో పాటు గ్రామంలోని పేద పిల్లలకు ఉచితంగా పాఠాలు చెప్పుతూ వారికి తోడుగా నిలుస్తాడు. అతని దగ్గరకు స్కూల్ పిల్లలు తరచూ వస్తూ ఉండటంతో, స్కూల్ టీచర్ నిమిషా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తుంది.

అయితే.. ఇక్క‌డ‌ చదువుకునే ఆర్య అనే అమ్మాయిని ఆమె సోదరుడు వివేక్ తరచూ కొట్టడం గమనించిన సీఐ క్రిస్టో, అతడిని హెచ్చరిస్తాడు. అయితే మ‌రోమారు ఆర్య తన బాయ్‌ఫ్రెండ్‌తో మాట్లాడుతుండాన్ని వివేక్ సహించలేక ఇద్దరిపై దాడి చేస్తాడు. అనంతరం వివేక్ అదృశ్యమవుతాడు. అతడిని వెతుకుతూ క్రిస్టో ప్రారంభించిన విచారణలో ఊహించని మరో మర్డర్ కేసు వెలుగులోకి వస్తుంది.

ఆ హత్యకు గురైన అమ్మాయి ఎవరు? వివేక్ అదృశ్యానికి, ఆ హత్యకు ఏమైనా సంబంధం ఉందా? చివరికి క్రిస్టో ఈ కేసులను ఎలా ఛేదించాడు? నిందితులను ఎలా పట్టుకున్నాడు? అనే ఆస‌క్తిక‌ర‌మైన కథతో ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఈ సినిమాలో విలక్షణ నటుడు షైన్ టామ్ చాకో హీరోగా న‌టించ‌గా, విన్సీ ఆలోషియస్, దీపక్ పరంబోల్, టాలీవుడ్ నిర్మాత శ్రీకాంత్ కాండ్రేగుల కీలక పాత్రల్లో నటించి అందరినీ మెప్పించారు.