Kharge | ఆర్ఎస్ఎస్ ను బ్యాన్ చేయాలి : కాంగ్రెస్ చీఫ్ ఖర్గే
బీజేప, ఆర్ఎస్ఎస్ వల్లే భారతదేశంలో ఎక్కువగా శాంత్రి భద్రత సమస్యలు తలెత్తుతున్నాయని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. సర్ధార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంత్రి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీ పై చేసిన విమర్శలను ఖర్గే తిప్పి కొట్టారు. ఈ క్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (అర్ఎస్ఎస్) ను బ్యాన్ చేయాలన్నారు.
 
                                    
            బీజేప, ఆర్ఎస్ఎస్ వల్లే భారతదేశంలో ఎక్కువగా శాంత్రి భద్రత సమస్యలు తలెత్తుతున్నాయని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. సర్ధార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంత్రి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీ పై చేసిన విమర్శలను ఖర్గే తిప్పి కొట్టారు. ఈ క్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (అర్ఎస్ఎస్) ను బ్యాన్ చేయాలన్నారు. మహాత్మ గాంధీ హత్య తరువాత ఆర్ఎస్ఎస్ ను విమర్శిస్తూ పటేల్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ చీఫ్ ప్రస్తావించారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్, ఉక్కు మహిళ.. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ గొప్ప నేతలని ఖర్గే కొనియాడారు. వారు దేశానికి ఎంతో సేవ చేశారని, దేశ ఐక్యతను కాపాడేందుకు ఎంతో కృషి చేశారన్నారు. అర్ఎస్ఎస్ పై నిషేధం వ్యాఖ్యలపై అడిగిన ప్రశ్నకు కాంగ్రెస్ చీఫ్ ఖర్గే స్పందిస్తూ.. అది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు.
మహాత్మాగాంధీ హత్యకు దారితీసిన వాతావరణాన్ని అర్ఎస్ఎస్ సృష్టించిందని మండిపడ్డారు. ఇదే విషయాన్ని పేర్కొంటూ నాటి హోంమంత్రి పటేల్.. శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీకి లేఖ రాశారని గుర్తు చేశారు. భారత తొలి ప్రధాని నెహ్రూ, సర్దార్ పటేల్‌ల మధ్య గొప్ప సంబంధాలు ఉన్నప్పటికీ.. వారి మధ్య చీలిక తెచ్చేందుకు నిత్యం ప్రయత్నించేవారని విమర్శించారు. దేశ ఐక్యతకు ప్రతీకగా నిలిచిన సర్ధార్ పటేల్ ను నెహ్రూ ప్రశంసించారని, పటేల్ కూడా నెహ్రూను దేశానికి ఆదర్శంగా అభివర్ణించారని తెలిపారు. కశ్మీర్ మొత్తాన్ని దేశంలో కలపాలని పటేల్ కోరుకున్నారని, కానీ.. నాటి ప్రధాని నెహ్రూ ఆ ప్రయత్నాలను జరగనివ్వలేదంటూ ప్రధాని మోదీ ఆరోపించడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తీవ్రంగా స్పందించారు. కాగా, ఖర్గే వ్యాఖ్యలపై స్పంచించిన బీజేపీ దశాబ్ధాల పాటు సర్ధార్ పటేల్ చేసిన సేవలను కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని దుయ్యబట్టింది.
 
                     X
                                    X
                                 Google News
                        Google News
                     Facebook
                        Facebook
                     Instagram
                        Instagram
                     Youtube
                        Youtube
                     Telegram
                        Telegram