India vs Australia 2nd T20 | రెండో టీ 20లో భారత్ 125 అలౌట్

మెల్‌బోర్న్ టీ20లో టీమిండియా బ్యాటర్లు ఫెయిల్.. 125 పరుగులకే ఆలౌట్. అభిషేక్ శర్మ అర్ధశతకంతో మెరిశాడు, అసీస్ బౌలర్లు అదిరిపోయారు.

Reported by: Tejaswini Nanna | క్రీడలు | Oct 31, 2025, 3:48 pm IST
Read Time: 3 mins
India vs Australia 2nd T20 | రెండో టీ 20లో భారత్ 125 అలౌట్

విధాత : మెల్ బోర్న్ వేదికగా అస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ 20 మ్యాచ్ లో టీమిండియా 125పరుగులకు అలౌటైంది. అభిషేక్ శర్మ(68), హర్షిత్ రాణా(35) మినహా మిగతా బ్యాటర్లు అంతా ఇలా వచ్చి అలా పెవిలియన్ చేరడంతో భారత్ ఈ మ్యాచ్ లో అసీస్ ముందు కేవలం 18.4ఓవర్లలో 125పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచగలిగింది.

టాస్ గెలిచిన అసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఒపెనర్ గిల్( 5) , సంజు శాంసన్ (2) సూర్యకూమార్ యాదవ్(1) లు వరుసగా స్వల్ప స్కోర్లకే వెనుతిరిగారు. తిలక్ వర్మ భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో కీపర్ ఇంగ్లీస్ అద్బుత క్యాచ్ తో డకౌట్ అయ్యాడు. కాసేపటికే అక్షర పటేల్(7) రనౌట్ కాగా, శివమ్ దూబె(4) కూడా అవుటై నిరాశపరిచారు. ఈ పరిస్థితులో మరో ఓపెనర్ అభిషేక శర్మ మాత్రం తన దూకుడును కొనసాగిస్తూ 2సిక్స్ లు, 8ఫోర్లతో 68 పరుగులతో భారత్ గౌరవ ప్రద స్కోర్ చేసేలా ప్రయత్నించాడు. అతనికి బౌలర్ హర్షిత్ రాణా 1సిక్స్, 2ఫోర్లతో 35పరుగులు సాధించి మంచి సహకారం అందించాడు. కుల్ధీప్ యాదవ్(0), బూమ్రా రనౌట్(0) లు డకౌట్ కాగా, వరుణ్ చక్రవర్తి(0) నాటౌట్ గా నిలిచాడు. 5 మ్యాచ్ ల టీ 20సిరీస్ లో తొలి మ్యాచ్ వర్షంతో రద్దు కాగా, రెండో టీ 20లో భారత్ ఓటమిని తప్పించుకునేందుకు పోరాడుతుంది.

అస్ట్రేలియా బౌలర్లలో హెజల్ వుడ్ 3 వికెట్లు, బార్టె లెట్, నాథన్ ఎల్లిస్ చెరో 2వికెట్లు, స్టైయినిస్ 1వికెట్ సాధించారు.