Mass Jathara Premiere Release | ఇంకాసేపట్లో మాస్ జాతర ప్రీమియర్స్ షోలు

మాస్ మహారాజ్ రవితేజ, శ్రీలీల జంటగా మాస్ జాతర సినిమా ప్రీమియర్స్ ఇంకాసేపట్లో స్టార్ట్. రవితేజ కెరీర్‌లో 75వ చిత్రంగా అంచనాలు పెరిగాయి.

Mass Jathara Premiere Release | ఇంకాసేపట్లో మాస్ జాతర ప్రీమియర్స్ షోలు

విధాత : మాస్ మహారాజ్ రవితేజా, యంగ్ బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన మాస్ జాతర సినిమా ప్రీమియర్స్ షోలు ఇంకాసేపట్లో వరల్డ్ వైడ్ గా ప్రదర్శితం కాబోతున్నాయి. భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మాస్ జాతరను… సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్‌ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు సంయుక్తంగా నిర్మించారు. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్ వంటి వరుస ఫ్లాపుల తర్వాత రవితేజ నటిస్తున్న చిత్రం కావడంతో మాస్ జాతరపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా రవితేజ కెరీర్‌లో 75వ చిత్రం కావడం విశేషం.

అక్టోబర్ 31న మాస్ జాతర సినిమా వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సంబంధించి నార్త్ అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాలలో అక్టోబర్ 31వ తేదీ ప్రీమియర్స్ ప్రదర్శితం కానున్నాయి. దాదాపు 90 కోట్ల రూపాయల బడ్జెట్ రూపొందిన మాస్ జాతర మూవీలో రవితేజ, శ్రీలీల లుక్స్‌తో పాటు టీజర్, ట్రైలర్ల కారణంగా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా సినిమాలోని పాటలు మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమా హిట్ పై హైప్ పెంచాయి. రవితేజ, శ్రీలీలకు ఇద్దరి కూడా ఈ సినిమా సక్సెస్ కెరీర్ కు అవసరంగా మారింది.

సినిమాలో నవీన్ చంద్ర విలన్ రోల్ పోషించగా.. రాజేంద్రప్రసాద్, నరేష్, ప్రవీణ్, హిమజ, వీటీవీ గణేష్, హైపర్ ఆది, అజయ్ ఘోష్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. విదు అయ్యన్న సినిమాటోగ్రాఫర్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.