Vijay Antony| తమిళ నటుడు విజయ్ ఆంటోని గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తెలుగులో బిచ్చగాడు సినిమాతో వచ్చి సంచలనం సృష్టించాడు. బిచ్చగాడు సి
Vijay Antony| తమిళ నటుడు విజయ్ ఆంటోని గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తెలుగులో బిచ్చగాడు సినిమాతో వచ్చి సంచలనం సృష్టించాడు. బిచ్చగాడు సినిమా ప్రతి ఒక్కరిని ఎంతగానో అలరించింది. బిచ్చగాడు మూవీ లో విజయ్ ఆంటోనీ హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఈ సినిమాకు దర్శకుడుగా , సంగీత దర్శకుడుగా , నిర్మాతగా కూడా వ్యవహరించి తన సత్తా ఏంటో చూపించాడు. బిచ్చగాడు మూవీ తర్వాత విజయ్ ఆంటోని తను నటించిన ప్రతి సినిమాని తమిళంతో పాటు తెలుగులోను విడుదల చేశాడు. అయితే ఏ సినిమా కూడా బిచ్చగాడు అంత హిట్ కాలేదు.
అయితే విజయ్ ఆంటోనీ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘తుఫాన్’. ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ పతాకంపై కమల్ బోరా, డి.లలితా, బి.ప్రదీప్, పంకజ్ బోరా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయ్ మిల్టన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టీజర్ తాజాగా విడుదల కాగా, మూవీ టీం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజయ్ అంటోని పలు విషయాలను పంచుకున్నాడు. చెప్పులు లేకుండా ఈ కార్యక్రమానికి విజయ్ ఆంటోని రాగా, ఆయనని చూసిన మీడియా ఏదైనా దీక్షలో ఉన్నారా అని ప్రశ్నించారు. అందుకు ఆయన బదులిస్తూ.. షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘‘నేను ఎలాంటి దీక్షలో లేను. కాకపోతే గత మూడు నెలలుగా చెప్పులు లేకుండానే తిరుగుతున్నాను. ఇక జీవితాంతం చెప్పులు ధరించకూడదని నిర్ణయం తీసుకున్నాను’’ అని చెప్పుకొచ్చాడు
ఒకరోజంతా నేను చెప్పులు లేకుండా తిరిగాను. అప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. చెప్పులు లేకుండా నడిస్తే.. చాలా ప్రశాంతంగా ఉండడంతో పాటు ఆరోగ్యంగా కూడా ఉంటుంది. ఎప్పుడైతే నేను చెప్పులు లేకుండా తిరగడం ప్రారంభించానో ఆ సమయం నుంచి నేను ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా చాలా ప్రశాంతంగా ఉంటున్నాను. ఇక జీవితాంతం చెప్పులు లేకుండా ఉండాలని డిసైడ్ అయ్యాను అని విజయ్ ఆంటోని అన్నారు. ఏది ఏమైన జీవితాంతం చెప్పులు వేసుకోకుండా ఉండాలని విజయ్ ఆంటోని తీసుకున్న నిర్ణయం పట్ల అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.