Vijay Devarakonda Rowdy Janardhan | విజయ్ దేవరకొండ..కీర్తి సురేష్ ‘రౌడీ జనార్దన్’ షురూ
విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్ కాంబినేషన్‌లో రవి కిరణ్ కోలా దర్శకత్వంలో రూపొందనున్న కొత్త సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సినిమాకు 'రౌడీ జనార్దన్' అనే టైటిల్ ఖరారు చేశారు.

విధాత: విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా రవి కిరణ్ కోలా దర్శకత్వంతో రూపొందించనున్న కొత్త సినిమా షూటింగ్ శనివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సినిమాకు ‘రౌడీ జనార్దన్’ పేరును ఖరారు చేశారు. మూవీ షూటింగ్ ప్రారంభోత్సవానికి నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్ హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సినిమా టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ఎస్‌వీసీ బ్యానర్‌లో 49వ చిత్రంగా నిర్మాణం జరుపుకోనుంది.
రాజావారు రాణిగారు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడే రవికిరణ్ కోలా..విజయ్‌తో యాక్షన్‌కు ప్రాధాన్యం ఉన్న కథను తెరకెక్కిస్తున్నారు. ఈనెల 16 నుంచి ముంబయిలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మొదటిసారి విజయ్ సరసన కీర్తి సురేశ్ కనిపించనుండడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. విజయ్ చివరగా కింగ్ డమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికి..ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోవడంలో విఫలమైంది. అంతకుముందు, లైగర్, ఖుషీ, ఫ్యామిలీ స్టార్ సినిమాలు కూడా ఫల్టీ కొట్టడంతో రౌడీ జనార్దన్’ విజయం సాధించడం విజయ్ కెరీర్ కు కీలకంగా మారనుంది.