Perni Nani : మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదు

సీఐ ఏసుబాబుపై వాగ్వాదానికి దిగి బెదిరించారన్న ఆరోపణలతో మాజీ మంత్రి పేర్ని నానిపై మరియు మరో 29 మందిపై చిలకలపూడి పీఎస్‌లో కేసు నమోదైంది.

Perni Nani : మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదు

అమరావతి : మాజీ మంత్రి పేర్ని నానిపై ఆర్.పేట సీఐ ఏసుబాబుపై వాగ్వవాదానికి దిగి బెదిరింపులకు పాల్పడ్డారన్న అభియోగాలతో చిలకలపూడి పీఎస్ లో కేసు నమోదు చేశారు. పేర్ని నానితో పాటు మరో 29 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ నేత సుబ్బన్నను శుక్రవారం విచారణ కోసం మచిలీపట్నం టౌన్‌ పీఎస్‌కు పిలిచారు. ఈక్రమంలో అక్కడికి వెళ్లిన పేర్ని నాని సీఐ ఏసుబాబుతో వాగ్వాదానికి దిగారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం పోలీసులను బెదిరించే ధోరణిలో వ్యవహరించడంపై మండిపడింది. దీంతో పోలీసులు పేర్ని నానిపైన, అనుచరులపైన కేసు నమోదు చేశారు.

ఈ ఘటనపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. నేను సీఐ ఏసుబాబు విధులకు ఎక్కడా ఆటంకం కలింగచలేదు అని స్పష్టం చేశారు. సుబ్బన్నను వదిలిపెట్టమని అడగలేదు, తీసుకెళ్తానని చెప్పలేదు అన్నారు.పెళ్లీ పీటలమీద కుర్చోవాల్సి ఉండటంతో త్వరగా రిమాండ్ పెట్టమని అడిగాను అని వివరణ ఇచ్చారు. మా మేయర్ భర్తపై సీఐ రెచ్చగొట్టేలా మాట జారాడని..కేసు కడితే ఏం చేస్తాం అరెస్టు అవుతాం, బెయిల్ తీసుకొచ్చుకుంటాం అని పేర్ని నాని వ్యాఖ్యానించారు.