Love Reddy|ఆడియన్స్‌లో నుండి వచ్చి నటుడిని చితక్కొట్టిన మహిళ.. ఎందుకో తెలిస్తే షాకవుతారు..!
Love Reddy| సినిమాలోని కొన్ని పాత్రలు రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటాయి. ఆ పాత్రలలో సదరు నటీనటులు పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి జీవించేస్తారు. ఆ సమయంలో ప్రేక్షకుడు కొన్నిపాత్రలపై ఫుల్ కోపంతో రగిలిపోతుంటారు. తాజాగా లవ్ రెడ్డి చిత్రంలో నటించిన నటుడు ఎన్టీ రామస్వామి

Love Reddy| సినిమాలోని కొన్ని పాత్రలు రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటాయి. ఆ పాత్రలలో సదరు నటీనటులు పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి జీవించేస్తారు. ఆ సమయంలో ప్రేక్షకుడు కొన్నిపాత్రలపై ఫుల్ కోపంతో రగిలిపోతుంటారు. తాజాగా లవ్ రెడ్డి(Love Reddy) చిత్రంలో నటించిన నటుడు ఎన్టీ రామస్వామిపై ఓ మహిళ దాడి చేసింది. లవ్ రెడ్డి చిత్ర పతాక సన్నివేశాలు చూసి భావోద్వేగానికి గురైన ఆ మహిళ ప్రేమజంటను విడదీస్తావా అంటూ కోపంతో రామస్వామి ((Rama Swamy)కాలర్ పట్టుకొని దూర్భాషలాడుతూ అతనిపై చేయి చేసుకోబోయింది. దాంతో పక్కనే ఉన్న చిత్ర బృందం మహిళని ఆపే ప్రయత్నం చేశారు.
హీరో అంజన్, హీరోయిన్ శ్రావణి, దర్శకుడు స్మరణ్ రెడ్డి ఆ మహిళను అడ్డుకొని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వారు ఎంత చెప్పిన కూడా ఆమె మరింత కోపంతో ఆ మహిళ రామస్వామిపై దాడికి దిగే ప్రయత్నం చేసింది. ఆ మహిళ వెంట వచ్చిన వారు, ఇతర ప్రేక్షకులు ఆమెకు సర్దిచెప్పడంతో చివరికి ఆమె శాంతించింది. ఇది కేవలం సినిమా మాత్రమేనని ఆమెకు తెలియజేశారు. ఎన్ టీ రామస్వామి తండ్రి పాత్రలో నటించాడని, అతను సినిమాలో చూపించినట్లు చెడ్డవాడు కాదంటూ మహిళకు చెప్పి అక్కడి నుంచి పంపించివేశారు. అంటే రామస్వామి తన పాత్రతో ప్రేక్షకులని ఎంతగా అలరించాడో అర్ధమైంది. ఈనెల 18న విడుదలైన లవ్ రెడ్డి(Love Reddy) చిత్రంలో అంజన్ రామచంద్ర, శ్రావణి జంటగా నటించారు.
చిత్ర కథ ఏంటంటే..నారాయణ రెడ్డి (అంజన్ రామచంద్ర) తనకు ముప్పై ఏళ్ళు వచ్చినా, నచ్చిన పిల్ల దొరకలేదు అని పెళ్లి చేసుకోకుండా ఉండిపోతాడు. ఈ క్రమంలో దివ్య (శ్రావణి రెడ్డి) ని చూసి ప్రేమలో పడతాడు. కానీ మనసు విప్పి ఆమెతో ఆ విషయం చెప్పలేక, ఆమె కూడా తనను ప్రేమిస్తోందని గుడ్డిగా నమ్ముతూ.. ఆమె వెంటే తిరుగుతూ ఉంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో దివ్య కూడా నారాయణ రెడ్డితో క్లోజ్ గా ఉంటుంది. అయితే ఊహించని విధంగా దివ్య(Divya)కి పెళ్లి సంబంధం వస్తుంది. మరి ఆ తర్వాత వీరిద్దరి మధ్య ఎలాంటి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది సినిమా చూస్తే అర్ధమవుతుంది.