Sonu Sood: రాజకీయాల్లోకి వస్తే.. ఫ్రీడం ఉండదు

విధాత: రీల్ లైఫ్‌లోనే కాదు రియల్‌గా కూడా హీరోనే అనిపించుకున్న నటుడు సోనూసూద్. నిజ జీవితంలో తన సహాయ గుణంతో దేశవ్యాప్తంగా విశేషంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఇటీవల సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన సోనూ తాజాగా స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తూ, నిర్మించిన హిందీ చిత్రం ఫతే (Fateh).
ఈ మూవీ రామ్ చరణ్ గేంజర్ విడుదలవుతున్న రోజునే జనవరి10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసందర్భంగా అయన సినిమా ప్రమోషన్స్ చేస్తూ పలు ఆసక్తికర విషయాలు వెళ్లడించారు.
’కొవిడ్ సమయంలో ప్రజలకు సాయం చేసినందుకు కొందరు రాజకీయ నాయకులు నాకు సీఎం పదవి, డిప్యూటీ సీఎం, రాజ్యసభ సభ్యత్వం వంటివి చాలా అఫర్ చేశారు కానీ నేను వాటిని తిరస్కరించా. ఫ్రీడం కోల్పోవడం నాకు ఇష్టం లేదు. అందుకే రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నా.
ప్రజలు డబ్బు సంపాదించడం లేదా అధికారం కోసం రాజకీయాల్లోకి వస్తారు. వాటిలో దేనిపైనా నాకు ఆసక్తి లేదు. ప్రజలకు సాయం చేయాలనుకుంటే అది ఇప్పటికే చేస్తున్నా అందు కోసం రాజకీయాలు అవసరం లేదు‘ అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.