విలేకరులమంటూ రూ.2లక్షలు డిమాండ్
తూ.గో,విధాత:కొత్తపేట నియోజకవర్గంలో బుధవారం తెల్లవారుజామున 16వ నెంబర్ జాతీయ రహదారిపై రావులపాలెం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎదురుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అని చెప్పుకు తిరిగే ఏడుగురు విలేకలరులు గుంటూరుకు చెందిన ఒక బియ్యం లారీని ఆపి రెండు లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. ఇవ్వని పక్షంలో మీ లారీ లోని బియ్యాన్ని పౌరసరఫరాల శాఖకు సంబంధించిన బియ్యం గా కేసు నమోదు చేయించి మిమ్మల్ని జైలుకు పంపిస్తామని బెదిరించారు.దీంతో సరుకు యజమాని ఇచ్చిన ఫిర్యాదు […]

తూ.గో,విధాత:కొత్తపేట నియోజకవర్గంలో బుధవారం తెల్లవారుజామున 16వ నెంబర్ జాతీయ రహదారిపై రావులపాలెం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎదురుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అని చెప్పుకు తిరిగే ఏడుగురు విలేకలరులు గుంటూరుకు చెందిన ఒక బియ్యం లారీని ఆపి రెండు లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. ఇవ్వని పక్షంలో మీ లారీ లోని బియ్యాన్ని పౌరసరఫరాల శాఖకు సంబంధించిన బియ్యం గా కేసు నమోదు చేయించి మిమ్మల్ని జైలుకు పంపిస్తామని బెదిరించారు.దీంతో సరుకు యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆకొండి వీర వెంకట సత్య సూర్యనారాయణ మూర్తి (పశ్చిమ వాహిని తిరుపతి),చిర్రా నాగరాజు (RTI ACTన్యూస్ ఛానల్),అయినవిల్లి విజయ్ బాబు(అనంత వాయిస్ తెలుగు దినపత్రిక),ఉందుర్తి రవికుమార్(D R S YOU TUBE CHANNEL),పలివెల రాజు (జై జనని తెలుగు దినపత్రిక),ఉమ్మిడిశెట్టి వెంకటేశ్వరరావు (గోదావరి తెలుగు దినపత్రి), CH రాజేంద్రప్రసాద్ (V10 NEWS ఛానల్)
విలేకరులపై రావులపాలెం పోలీసులు కేసు నమోదు చేసి కొత్తపేట కోర్టులో హాజరుపరిచనున్నట్లు DSP వై. మాధవరెడ్డి తెలిపారు.