Crocodile | బ‌హిర్భూమికి వెళ్ల‌గా.. వృద్ధుడి పురుషాంగాన్ని కొరికేసిన మొస‌లి..

Crocodile | ఓ 60 ఏండ్ల వ్య‌క్తి బ‌హిర్భూమికి వెళ్లాడు. కాలువలో ఉన్న మొస‌లి( Crocodile ) అత‌ని గ్ర‌హించి, పురుషాంగాన్ని( Private Part ) కొరికేసి తీవ్రంగా గాయ‌ప‌రిచింది. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌( Uttar Pradesh )లోని ఖుషిన‌గ‌ర్‌లో వెలుగు చూసింది.

  • By: raj    crime    Jul 09, 2024 10:02 PM IST
Crocodile | బ‌హిర్భూమికి వెళ్ల‌గా.. వృద్ధుడి పురుషాంగాన్ని కొరికేసిన మొస‌లి..

Crocodile | ల‌క్నో : ఓ 60 ఏండ్ల వ్య‌క్తి బ‌హిర్భూమికి వెళ్లాడు. కాలువలో ఉన్న మొస‌లి( Crocodile ) అత‌ని గ్ర‌హించి, పురుషాంగాన్ని( Private Part ) కొరికేసి తీవ్రంగా గాయ‌ప‌రిచింది. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌( Uttar Pradesh )లోని ఖుషిన‌గ‌ర్‌లో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఖుషిన‌గ‌ర్‌కు చెందిన ఓ 60 ఏండ్ల వ్య‌క్తి బ‌హిర్భూమి కోస‌మ‌ని.. స్థానికంగా గంద‌క్ కాలువ( Gandak Canal ) వ‌ద్ద‌కు వెళ్లాడు. ఇక కాలువ ఒడ్డున అత‌ను బ‌హిర్భూమికి కూర్చోగా.. నీటిలో ఉన్న మొస‌లి అత‌న్ని గ్ర‌హించింది. వెనుకాల నుంచి ఉన్న‌ట్టుండి.. ఆ మొస‌లి అత‌ని పురుషాంగాన్ని కొరికేసింది. దీంతో అత‌నికి తీవ్ర ర‌క్త‌స్రావం జ‌రిగింది.

బాధిత వ్య‌క్తి గ‌ట్టిగా అర‌వ‌డంతో.. స‌మీప పొలాల్లో ఉన్న వారంతా అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. వారు వ‌చ్చే లోపు మొస‌లి దాడి నుంచి బాధితుడు త‌ప్పించుకున్నాడు. పురుషాంగం కెనాల్‌లోనే ప‌డిపోయింది. తీవ్ర ర‌క్త‌స్రావంతో బాధ‌ప‌డుతున్న బాధితుడిని చికిత్స నిమిత్తం ప్ర‌యివేటు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అత‌ని ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌డంతో మెరుగైన చికిత్స కోసం గోర‌ఖ్‌పూర్ మెడిక‌ల్ కాలేజీకి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం అత‌నికి చికిత్స కొన‌సాగుతోంద‌ని వైద్యులు తెలిపారు.

గంద‌క్ కాలువ బుధ్వా ఫారెస్ట్ ప‌రిధిలో ఉంది. అయితే గంద‌క్ కాలువ‌లో మొస‌ళ్లు సంచ‌రిస్తున్నాయ‌ని, అటు వైపు ఎవ‌రూ వెళ్లొద్ద‌ని అట‌వీశాఖ అధికారులు స్థానికుల‌ను అప్ర‌మ‌త్తం చేశారు. భారీ వ‌ర్షాల కార‌ణంగా మొస‌ళ్ల సంచారం అధికంగా ఉండే అవ‌కాశం ఉంద‌ని, స్థానికులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు అధికారులు.