మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడికి హైకోర్టులో ఊరట

జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్‌కు హైకోర్టులో ఊరట లభించింది. రాహిల్‌ను రెండు వారాల వాటు అరెస్టు చేయకుండా ధర్మాసనం స్టే విధించింది

మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడికి హైకోర్టులో ఊరట

అరెస్టుపై రెండు వారాల స్టే

విధాత, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్‌కు హైకోర్టులో ఊరట లభించింది. రాహిల్‌ను రెండు వారాల వాటు అరెస్టు చేయకుండా ధర్మాసనం స్టే విధించింది. గతంలో రాహిల్‌కు హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను సవాల్ చేస్తూ జూబ్లీహిల్స్ పోలీసులు అప్పిల్‌కు వెల్లగా, మంగళవారం ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు రాహిల్ అరెస్టుపై రెండువారాల స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. రెండేళ్ల క్రితం జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. కారుపై స్టిక్కర్ ఆధారంగా మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు చెందినదిగా గుర్తించిన పోలీసులు.. ప్రమాద సమయంలో కారులో షకీల్ కొడుకు రాహిల్, స్నేహితులు ఆఫ్నాన్, మౌజ్‌ ఉన్నట్లు గుర్తించారు. అయితే అనూహ్యంగా కారు తానే నడిపాను అంటూ ఆఫ్నాన్ అనే యువకుడు పోలీసులకు లొంగిపోయాడు. కేసు రీ ఓపెన్ చేసిన అధికారులు ప్రధాని నిందితుడు రాహిల్‌గా గుర్తించారు. అప్పట్లో ఈ కేసు నుంచి రాహిల్‌ను తప్పించేందుకు ప్రయత్నించారన్న అభియోగాలతో విచారణాధికారులుగా ఉన్న పోలీసు అధికారులను సైతం ఇటీవల సస్పెండ్ చేశారు.