కుప్పం ఎన్నికల అధికారి ఉండ‌గా వేరొక‌రిని ఎందుకు నియ‌మించారు:హైకోర్టు

విధాత‌: కుప్పం పురపాలక సంస్థ ఎన్నికల అధికారిగా పట్టు పరిశ్రమకు చెందిన సుబ్రమణ్యం ఉన్నప్పుడు.. ప్రత్యేక అధికారిగా మరొకరిని ఎందుకు నియమించాల్సి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని(ఎస్‌ఈసీ), రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఏ చట్టం ప్రకారం ఇలా చేశారో చెప్పాలంది. కుప్పంలో ఎన్నికలు నిష్పాక్షికంగా నిర్వహించేందుకు రిటర్నింగ్‌ అధికారి(ఆర్వో) లోకేశ్వరవర్మను బాధ్యతల నుంచి తొలగించి తక్షణం మరో ఆర్వోను నియమించేలా ఎస్‌ఈసీని ఆదేశించాలని కోరుతూ 20వ వార్డు తెదేపా అభ్యర్థి వి.వెంకటరమణ హైకోర్టులో వ్యాజ్యం వేశారు