High Court | తెలంగాణ‌, ఏపీ హైకోర్టుల‌కు కొత్త సీజేలు..!

High Court | తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల హైకోర్టుల‌కు కొత్త చీఫ్ జ‌స్టిస్‌ల పేర్ల‌ను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార‌సు చేసింది. తెలంగాణ‌కు జ‌స్టిస్ అలోక్ అర‌దే పేరును కొలీజియం సిఫార‌సు చేయ‌గా, ఏపీకి జ‌స్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ పేరును సిఫారసు చేసింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి చెందిన జస్టిస్ అలోక్ అర‌దే.. 2009లో అక్క‌డి హైకోర్టు జడ్జిగా నియ‌మితుల‌య్యారు. 2018, న‌వంబ‌ర్ నుంచి క‌ర్ణాట‌క హైకోర్టు న్యాయ‌మూర్తిగా కొన‌సాగుతున్నారు. జ‌మ్మూక‌శ్మీర్‌కు చెందిన జ‌స్టిస్ ధీర‌జ్ సింగ్ ఠాకూర్ […]

High Court | తెలంగాణ‌, ఏపీ హైకోర్టుల‌కు కొత్త సీజేలు..!

High Court |

తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల హైకోర్టుల‌కు కొత్త చీఫ్ జ‌స్టిస్‌ల పేర్ల‌ను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార‌సు చేసింది. తెలంగాణ‌కు జ‌స్టిస్ అలోక్ అర‌దే పేరును కొలీజియం సిఫార‌సు చేయ‌గా, ఏపీకి జ‌స్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ పేరును సిఫారసు చేసింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి చెందిన జస్టిస్ అలోక్ అర‌దే.. 2009లో అక్క‌డి హైకోర్టు జడ్జిగా నియ‌మితుల‌య్యారు. 2018, న‌వంబ‌ర్ నుంచి క‌ర్ణాట‌క హైకోర్టు న్యాయ‌మూర్తిగా కొన‌సాగుతున్నారు.

జ‌మ్మూక‌శ్మీర్‌కు చెందిన జ‌స్టిస్ ధీర‌జ్ సింగ్ ఠాకూర్ 2013లో అక్క‌డి హైకోర్టు జ‌డ్జిగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. 2022 నుంచి బాంబే హైకోర్టు జ‌డ్జిగా కొన‌సాగుతున్నారు. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో జ‌స్టిస్ ధీరజ్ సింగ్‌ను మ‌ణిపూర్ హైకోర్టు చీఫ్ జ‌స్టిస్‌గా సుప్రీంకోర్టు కొలిజియం సిఫార‌సు చేసింది.

అది కేంద్రం వ‌ద్ద పెండింగ్‌లో ఉన్నందున, ఆ సిఫార‌సును కొలీజియం ర‌ద్దు చేసింది. తాజాగా ఏపీ హైకోర్టు సీజేగా జ‌స్టిస్ ధీర‌జ్ సింగ్ పేరు సిఫార‌సు చేసింది. ఈ సిఫార‌సుల‌కు రాష్ట్ర‌ప‌తి ఆమోద ముద్ర వేయాల్సి ఉంది.

ప్ర‌స్తుతం తెలంగాణ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా కొన‌సాగుతున్న జ‌స్టిస్ ఉజ్జ‌ల్ భూయాన్‌ను సుప్రీంకోర్టు జ‌డ్జిగా ప‌దోన్న‌తి క‌ల్పిస్తూ కొలీజియం కేంద్రానికి సిఫార‌సు చేసిన సంగ‌తి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ వెంకటనారాయణ భట్టిని కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని సిఫారసు చేసింది.