Crime News | అందుకు ఒప్పుకోలేద‌ని.. బాయ్ ఫ్రెండ్ పురుషాంగాన్ని కోసేసిన మ‌హిళా డాక్ట‌ర్

Crime News | ఓ మ‌హిళా డాక్ట‌ర్ త‌న ప్రియుడి ప‌ట్ల క్రూరంగా ప్ర‌వ‌ర్తించింది. ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేద‌నే కోపంతోనే ఆమె త‌న బాయ్ ఫ్రెండ్ పురుషాంగాన్ని ప‌దునైన ఆయుధంతో కోసేసింది. ఈ దారుణ ఘ‌ట‌న బీహార్‌లోని సార‌ణ్ జిల్లాలో సోమ‌వారం చోటు చేసుకుంది.

  • Publish Date - July 2, 2024 / 09:58 AM IST

Crime News |ఓ మ‌హిళా డాక్ట‌ర్ త‌న ప్రియుడి ప‌ట్ల క్రూరంగా ప్ర‌వ‌ర్తించింది. ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేద‌నే కోపంతోనే ఆమె త‌న బాయ్ ఫ్రెండ్ పురుషాంగాన్ని ప‌దునైన ఆయుధంతో కోసేసింది. ఈ దారుణ ఘ‌ట‌న బీహార్‌లోని సార‌ణ్ జిల్లాలో సోమ‌వారం చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. హాజీపూర్‌కు చెందిన ఓ 25 ఏండ్ల యువ‌తి వృత్తిరీత్యా డాక్ట‌ర్. ఆమె మ‌ధౌర‌లో ప్రాక్టీస్ చేస్తోంది. మ‌ధౌర బ్లాక్‌లోని 12వ వార్డు కౌన్సిల‌ర్‌గా ఉన్న ఓ యువ‌కుడితో ఆమె ప్రేమ‌లో ఉంది. గ‌త ఐదేండ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే డాక్ట‌ర్ త‌న‌ను పెళ్లి చేసుకోవాల‌ని ప్రియుడిని కోరింది. కానీ అత‌ను పెళ్లికి అంగీక‌రించ‌లేదు.

దీంతో కోపంతో ఊగిపోయిన ప్రియురాలు త‌న బాయ్ ఫ్రెండ్‌ను ఇంటికి పిలిపించుకుంది. ఇక ప‌దునైన ఆయుధంతో అత‌ని పురుషాంగాన్ని కోసేసింది. ఆ బాధ‌ను భ‌రించ‌లేక బాధితుడు గ‌ట్టిగా అరిచాడు. ఇరుగుపొరుగు వారు అప్ర‌మ‌త్త‌మై డాక్ట‌ర్ ఇంటికి చేరుకున్నారు. ఆమె బాయ్ ఫ్రెండ్‌ను చూసి షాక‌య్యారు. తీవ్ర ర‌క్త‌స్రావంతో బాధ‌ప‌డుతున్న అత‌న్ని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం బాధితుడికి పాట్నా మెడిక‌ల్ కాలేజీ హాస్పిట‌ల్‌లో చికిత్స కొన‌సాగుతోంది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు మ‌హిళా డాక్ట‌ర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Latest News