బెంగుళూర్‌లో మహిళా అధికారిణి హత్య

  • By: Somu    crime    Nov 05, 2023 11:08 AM IST
బెంగుళూర్‌లో మహిళా అధికారిణి హత్య

విధాత : బెంగుళూర్‌లో గనుల శాఖ డిప్యూటీ డైరక్టర్‌గా ఉన్న ప్రతిమ దారుణ హత్యకు గురైంది. భర్త, కుమారుడు సొంతూరుకు వెళ్లారు. డ్రైవర్‌ ఆమెను ఇంటి వద్ధ రాత్రి విడిచి వెళ్లాడు. ఉదయం ఆమె ఎంతకు ఫోన్‌ ఎత్తకపోవడంతో అనుమానంతో వెళ్లి చూసి, జరిగిన ఘటనపై పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. తెలిసిన వాళ్లే ఆమెను హత్య చేసినట్లుగా భావిస్తున్నారు.