కారును ఢీకొన్న లారీ- ఒకే కుటుంబంలో న‌లుగురు దుర్మ‌ర‌ణం

గూడూరు : నెల్లూరు జిల్లాలో రెప్ప‌పాటులో ఘోరం జ‌రిగిపోయింది. తిరుమ‌ల శ్రీ‌ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని వెళ్తుండగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృత్యువాతపడ్డారు. గూడూరు ఆదిశంకర కళాశాల సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం ఈ యాక్సిడెంట్ జ‌రిగింది. తూర్పు గోదావరి జిల్లా పెదపూడి మండలం సంపర గ్రామానికి చెందిన తిబిరిశెట్టి వీరన్న (దొరబాబు) (46), ఆయన భార్య శ్రీవరలక్ష్మి (38), కుమార్తె నిఖిత (21), రాజమహేంద్రవరానికి చెందిన దొరబాబు బావమరిది […]

కారును ఢీకొన్న లారీ- ఒకే కుటుంబంలో న‌లుగురు దుర్మ‌ర‌ణం

గూడూరు : నెల్లూరు జిల్లాలో రెప్ప‌పాటులో ఘోరం జ‌రిగిపోయింది. తిరుమ‌ల శ్రీ‌ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని వెళ్తుండగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృత్యువాతపడ్డారు. గూడూరు ఆదిశంకర కళాశాల సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం ఈ యాక్సిడెంట్ జ‌రిగింది. తూర్పు గోదావరి జిల్లా పెదపూడి మండలం సంపర గ్రామానికి చెందిన తిబిరిశెట్టి వీరన్న (దొరబాబు) (46), ఆయన భార్య శ్రీవరలక్ష్మి (38), కుమార్తె నిఖిత (21), రాజమహేంద్రవరానికి చెందిన దొరబాబు బావమరిది మణికంఠ (37), అతడి భార్య స్వాతి (33) ఏపీ 28 డీసీ8496 నెంబరు గల కారులో తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లారు. దర్శనం అనంతరం స్వగ్రామానికి బయలుదేరారు. గూడూరు ఆదిశంకర కళాశాల సమీపంలో జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. దీంతో ఈ మార్గంలో రోడ్డు ఇరుకుగా ఉంది. ఈ క్రమంలో ముందు వెళ్తున్న లారీ.. స్పీడ్‌ బ్రేకర్లు రావడంతో వేగాన్ని ఒక్కసారిగా తగ్గించింది. వెనుక వస్తున్న కారు కూడా వేగాన్ని తగ్గించడంతో కారు వెనుక లోడుతో వస్తున్న లారీ వేగంగా వచ్చి కారును ఢీకొంది. దీంతో రెండు లారీల మధ్యలో కారు ఇరుక్కుని నుజ్జునుజ్జయింది.

దీంతో కారులో ప్రయాణిస్తున్న దొరబాబు, శ్రీవరలక్ష్మి, మణికంఠ మృతి చెందారు. స్వాతి, నిఖిత తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం నెల్లూరుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో స్వాతి మృతి చెందింది. నిఖిత నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను ఎక్స్‌కవేటర్‌ సాయంతో వెలికితీశారు. డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి, సీఐ శ్రీనివాసులురెడ్డి, ఎస్‌ఐలు పుల్లారావు, ఆదిలక్ష్మి సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.