సెల్‌ఫోన్ రిపేర్ కి డ‌బ్బు ఇవ్వ‌లేద‌ని .. వ్యక్తి హత్య‌..!

యాదాద్రి భువనగిరి: యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో సీతయ్య(42) అనే వ్యక్తి దారుణ హత్యకు గుర‌య్యాడు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్ర‌కాశం జిల్లాకు చెందిన ఆరితోటి సీతయ్య, పాలూరు కొండయ్యలు ఇద్ద‌రు స్నేహితులు వంగపల్లిలో మేస్త్రి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. బుధవారం రాత్రి ఇద్దరూ కలిసి మద్యం సేవించేక్రమంలో కొండయ్య తన మొబైల్ ఫోన్ రిపేర్ కోసం సీతయ్యను రూ.3 వేలు అడగ‌గా సీతయ్య ఇవ్వ‌క‌పోవ‌డంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది. అనంతరం ఎవ‌రి ఇంటికి వారు వెళ్లిపోయారు. […]

సెల్‌ఫోన్ రిపేర్ కి డ‌బ్బు ఇవ్వ‌లేద‌ని .. వ్యక్తి హత్య‌..!

యాదాద్రి భువనగిరి: యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో సీతయ్య(42) అనే వ్యక్తి దారుణ హత్యకు గుర‌య్యాడు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్ర‌కాశం జిల్లాకు చెందిన ఆరితోటి సీతయ్య, పాలూరు కొండయ్యలు ఇద్ద‌రు స్నేహితులు వంగపల్లిలో మేస్త్రి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. బుధవారం రాత్రి ఇద్దరూ కలిసి మద్యం సేవించేక్రమంలో కొండయ్య తన మొబైల్ ఫోన్ రిపేర్ కోసం సీతయ్యను రూ.3 వేలు అడగ‌గా సీతయ్య ఇవ్వ‌క‌పోవ‌డంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది. అనంతరం ఎవ‌రి ఇంటికి వారు వెళ్లిపోయారు. సీత‌య్య తన ఇంటి ఆరుబయట నిద్రిస్తుండగా.. గొడ‌వ‌ను మ‌న‌సులో పెట్టుకున్న కొండయ్య ఒక ఇనుప రాడ్ తో వెళ్లి నిద్రిస్తున్న సీతయ్య తలపైన బలంగా కొట్టాడు. దీంతో సీత‌య్య‌ అక్కడిక‌క్క‌డే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న యాదగిరిగుట్ట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు కొండయ్య పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.