నిండు గర్భిణి దారుణ హత్య.. ఆడపడుచు భర్త ఘాతుకం
విధాత, హైదరాబాద్: నగరంలో దారుణం చోటు చేసుకుంది. గచ్చిబౌలి పోలిస్ స్టేషన్ పరిధిలో నిండు గర్భిణి దారుణహత్యకు గురైంది. కుటుంబ కలహాలతో గర్భిణి అని చూడకుండా స్రవంతిని ఆడపడుచు భర్త శ్రీరామకృష్ణ వేట కొడవలితో కిరాతకంగా నరికి చంపాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిందితుడు శ్రీరామకృష్ణను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి.. రాజమహేంద్రవరంకు చెందిన వెంకట రామకృష్ణ […]

విధాత, హైదరాబాద్: నగరంలో దారుణం చోటు చేసుకుంది. గచ్చిబౌలి పోలిస్ స్టేషన్ పరిధిలో నిండు గర్భిణి దారుణహత్యకు గురైంది. కుటుంబ కలహాలతో గర్భిణి అని చూడకుండా స్రవంతిని ఆడపడుచు భర్త శ్రీరామకృష్ణ వేట కొడవలితో కిరాతకంగా నరికి చంపాడు.

సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిందితుడు శ్రీరామకృష్ణను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాలు ఇలా ఉన్నాయి.. రాజమహేంద్రవరంకు చెందిన వెంకట రామకృష్ణ తన భార్య స్రవంతితో కలిసి కొండాపూర్‌లో నివాసం ఉంటున్నాడు. వెంకట రామకృష్ణ మధ్యవర్తిగా ఉండి తన చిన్నమ్మ కుమార్తె లక్ష్మి ప్రసన్నకు 2020లో శ్రీరామకృష్ణతో వివాహం జరిపించాడు.
అయితే కొంతకాలానికే ఇరువురి మధ్య కలతలు చోటు చేసుకున్నాయి. అదనపు కట్నం కోసం లక్ష్మీప్రసన్నను రామకృష్ణ వేధించడంతో గత ఏడాది పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు.

అయినప్పటికీ శ్రీరామకృష్ణ ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేకపోవడంతో లక్ష్మీప్రసన్న పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన శ్రీరామకృష్ణ ఈనెల 6న కొండపూర్‌లో ఉంటున్న బామ్మర్ది ఇంటికి వేట కోడవలితో వెళ్లి ఒంటరిగా ఉన్న వెంకట కృష్ణ భార్య స్రవంతిపై దాడి చేశాడు.
నిండు గర్భిణి అని కూడా చూడకుండా ఆమె తల వెనుక భాగం భుజం మీద దాడి చేశాడు. తీవ్రంగా గాయ పడిన స్రవంతిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. స్రవంతి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.