ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులకు కోర్టులో చుక్కెదురు

సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన నలుగురు నిందితుల బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు కొట్టేసింది

  • By: Subbu |    crime |    Published on : Apr 26, 2024 6:33 PM IST
ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులకు కోర్టులో చుక్కెదురు

బెయిల్ పిటిషన్ల కొట్టివేత

విధాత, హైదరాబాద్ : సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన నలుగురు నిందితుల బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు కొట్టేసింది. నిందితులు మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, ఏసీపీలు తిరుపతన్న, భుజంగరావు, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావులు తమకు బెయిల్ ఇవ్వాలని నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్లు వేశారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసి శుక్రవారం వెలువరించింది. నిందితులు నలుగురి బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది.