గదిలో ఏసీ ఉంది.. రా!

విధాత:నెల్లూరు(వైద్యం)జూన్‌ 3 : నెల్లూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జొన్న ప్రభాకర్‌ తనను లైంగికంగా వేధిస్తున్నారని అదే ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న మహిళా హౌస్‌ సర్జన్‌ ఆరోపించడం సంచలనం రేపింది. వట్టి ఆరోపణలు చేయడం కాకుండా..దానికి ఆధారంగా ఆమె విడుదల చేసిన ఆడియో మరింత కలకలం రేపింది. తనపై జరుగుతున్న వేధింపులను ఫోన్‌లో సూపరింటెండెంట్‌ ప్రభాకర్‌ను నిలదీసిన సంభాషణ ఆ ఆడియోలో రికార్డు అయింది. సోషల్‌ మాధ్యమాల్లో గురువారం ఈ ఆడియో వైరల్‌ కావడంతో ప్రభాకర్‌పై మహిళా […]

గదిలో ఏసీ ఉంది.. రా!

విధాత:నెల్లూరు(వైద్యం)జూన్‌ 3 : నెల్లూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జొన్న ప్రభాకర్‌ తనను లైంగికంగా వేధిస్తున్నారని అదే ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న మహిళా హౌస్‌ సర్జన్‌ ఆరోపించడం సంచలనం రేపింది. వట్టి ఆరోపణలు చేయడం కాకుండా..దానికి ఆధారంగా ఆమె విడుదల చేసిన ఆడియో మరింత కలకలం రేపింది. తనపై జరుగుతున్న వేధింపులను ఫోన్‌లో సూపరింటెండెంట్‌ ప్రభాకర్‌ను నిలదీసిన సంభాషణ ఆ ఆడియోలో రికార్డు అయింది. సోషల్‌ మాధ్యమాల్లో గురువారం ఈ ఆడియో వైరల్‌ కావడంతో ప్రభాకర్‌పై మహిళా సంఘాలు ఆగ్రహించాయి. నెల్లూరు జీజీహెచ్‌లో వ్యవహారాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేశాయి. బాధితురాలు బయటపెట్టిన ఫోన్‌ రికార్డులను అనుసరించి..

హౌస్‌ సర్జన్‌ : ఎందుకు నన్ను పార్క్‌లకు రావాలని పిలుస్తావ్‌? ‘నా గదిలో ఏసీ ఉంది..రా’ అని ఎందుకు పిలిచావ్‌? నీకు పిల్లలు ఉంటే నా వయసు ఉంటుంది. ఇలా ప్రవర్తించటం కరెక్టా? నీ వయసేంటి.. నా వయసెంటి? నా చేతులూ కాళ్లూ కట్టేసి కారులో వేసుకుని తీసుకు పోతావా? నీ కూతురుతో ఇలా ఎవరైనా మాట్లాడితే వారికి ఇచ్చి పెళ్లి చేస్తారా?

సూపరింటెండెంట్‌: అయిపోయిందేదో అయిపోయింది. ఇక వదిలేయ్‌.. ఎండ్‌ అయిపోయింది.. కాగా, దీనిపై వివరణ ఇచ్చేందుకు సూపరింటెండెంట్‌ అందుబాటులో లేరు.